- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సంపేటలో కలకలం.. పట్టణం మధ్యలో..
దిశ, నర్సంపేట టౌన్: నియోజక వర్గంలోని నర్సంపేట పట్టణంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. సరైన సౌకర్యాలు లేని కుగ్రామాల్లో, మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేశారన్న వార్తలు అప్పుడప్పుడు వింటుంటాం. కానీ, ఓ నియోజకవర్గ కేంద్రంలో క్షుద్ర పూజలు పట్టణవాసుల్ని తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే…. నర్సంపేట పట్టణంలోని జయశ్రీ థియేటర్ కి దగ్గరలో గల 20వ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుభాష్ విగ్రహం వద్ద పసుపు, నిమ్మకాయలు, కోడిగుడ్డు, నల్ల కోడి, అన్నం ముద్దలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎవరో చేతబడి చేసినట్లుగా మరికొందరు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. దాదాపు రెండు నెలల కిందట ఇదే ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగి కొంత నగదును సైతం దోచుకెళ్లారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ సమస్య తలెత్తే అవకాశం ఉండేదికాదని కాలనీవాసులు ఆగ్రహం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
- Tags
- cc cameras