బోనాల స్పెషల్.. మద్యం షాపులు బంద్

by Shyam |
బోనాల స్పెషల్.. మద్యం షాపులు బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : బోనాల జాతర సందర్బంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 19వ తేదీ ఉదయం 6గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం దుకాణాలు తప్పనిసరిగా మూసివేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. బోనాల జాతర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. ఈ విషయం తెలియడంతో మందు బాబులు వైన్స్ షాపుల ఎదుట బారులు తీరినట్లు తెలస్తోంది.

Advertisement

Next Story