- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం ప్రియులకు షాకిస్తున్న వైన్స్.. అలా చెప్పి మరీ
దిశ, దంతాలపల్లి: మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండల కేంద్రంలో గల వైన్స్ నిర్వాహకులు మందుబాబులకు షాకిస్తున్నారు. మద్యం షాపులు నడుపుతున్న వ్యాపారస్తులు బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ సిండికేట్ చేసుకొని బెల్టు షాపుల ఓనర్లు పదిహేను రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. బెల్టు షాప్‌లకి మద్యం ఇచ్చేసి, వైన్స్‌లోకి వచ్చే ప్రజలకు కౌంటర్లలో షోకేజీలు చూపించి లేవు అని చెప్పి ముఖం చాటేస్తున్నారు.
ఇదేందీ బెల్టు షాప్‌లో దొరుకుతున్నాయి అని అడిగితే మా దగ్గర దొరకట్లెవ్ అంటున్నారు. మరీ మండల కేంద్రంలో మద్యం షాప్‌లో లేని మందు బెల్టు షాప్‌లో ఎలా దొరుకుతుంది. కల్తీ మందును అమ్ముతున్నారా.. అని ప్రజలు దీర్ఘ ఆలోచనలో పడుతున్నారు. మండల కేంద్రానికి కేవలం ఐదు, ఆరు కిలోమీటర్ల దూరంలో 17 గ్రామాలు ఉన్నపటికీ ఒక్కో గ్రామములో 20 పైగా బెల్టు షాప్‌లు ఉన్నాయి. సామాన్య ప్రజలు సేవించే మద్యం IB,ROYAL STAG, కింగ్ ఫిషర్ బీర్ కేవలం బెల్టు షాపులకు సిండికేట్ చేసి అమ్మి, గ్రామాల్లో బెల్ట్ షాప్ యజమానులు, కాయ కష్టం చేసే ప్రజల దగ్గర అధిక రేట్లు ఎక్కువ చేసి ప్రజల సొమ్ముని కూని చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన గరిష్ట రేట్ల కంటే ప్రతి బాటిల్ పై 5 రూపాయల రుసుము వసూలు చేస్తున్నారు.
చోద్యం చూస్తున్న ఆబ్కారీ అధికారులు..
మండల కేంద్రంలో గల రెండు మద్యం దుకాణాలలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఏ మాత్రం నమ్మకం కలిగించేలా లేదు అని వాపోతున్నారు. గ్రామానికి 20కి పైగా బెల్టు షాప్‌లు పెట్టిన ఏ రోజు చెకింగ్‌లు జరగడం లేదు. బెల్ట్ షాప్‌ల ఇష్టానుసారనికి చెక్ పెట్టకపోతే యువత తప్పుడు దారి పట్టి చెడిపోయే ప్రమాదముంది. దంతాలపల్లి మద్యం దుకాణాలను ఆనుకొని 3 కిలోమీటర్ల మేరకు 10 బెల్టు షాప్‌లు రోడ్డు పక్కనే ఉండటం వలన వాహన దారులు ఇబ్బంది పడటమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున, ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై కొంచెం నజర్ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళ సొమ్ము వమ్ము కాకుండా చూడాలని వాపోతున్నారు.
5 రూపాయలు ఎందుకు..
నేను షాప్ దగ్గరికి వెళ్లి మద్యం కొనుక్కుంటే గరిష్ట ధర కంటే, ఐదు రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఎందుకు ఐదు రూపాయలు అంటే సరైన సమాధానం లేక అంతే అంటూ, కావాల్సిన బ్రాండ్ లేవు అని పంపిస్తున్నారు. బెల్ట్ షాప్‌లోకి వెళ్తే అన్ని ఉంటున్నాయి.
మాటేటి లక్ష్మణ్ -దంతాలపల్లి గ్రామ వాసి