లాటరీ పద్దతిలో లిక్కర్ షాపులు.. ఎవరికి ఎన్నంటే ?

by Aamani |
లాటరీ పద్దతిలో లిక్కర్ షాపులు.. ఎవరికి ఎన్నంటే ?
X

దిశ, నిర్మల్ కల్చరల్: లాటరీ పద్దతిద్వారా జిల్లాలో వైన్ షాపుల రిజర్వేషన్ల ను కేటాయించామని జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైన్ షాపుల రిజర్వేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలో ఉన్న 47వైన్ షాపుల్లో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్థులకు-3 షాపులు, ఎస్సీలకు-5, ఎస్టీలకు-1, రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీ ద్వారా కేటాయించామన్నారు.

ఈ ప్రక్రియను వీడియోద్వారా రికార్డు చేశామన్నారు. కాగా నిర్మల్ లో 2 గౌడ కులస్తులకు, ఎస్సీలకు సారంగాపూర్, కడెం, ముధోల్ మరియు భైంసా మున్సిపాలిటీలో 2, ఖానాపూర్ లో ఒకటి ఎస్ టీ లకు రిజర్వేషన్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎన్. శ్రీనివాస్ రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కె.రాజలింగు, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి వి.రాజేశ్వర్ గౌడ్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed