కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..

by Shyam |
కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..
X

దిశ, చిట్యాల: ఈనెల 23న చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి లోడంగి శ్రవణ్ కుమార్ కోరారు. శుక్రవారం చిట్యాల పట్టన కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ పోరాటాల మూలంగా ఏర్పడిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్ లను తీసివేసి ఉపాధి పనులకు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపించారు.

గ్రామీణ ప్రజలకు 200 రోజులు తప్పక పని కల్పించాలని, వృద్ధాప్య వితంతు పెన్షన్లు 4000 రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ జహంగీర్, ఎండి అక్బర్, రైతు సంఘం నియోజకవర్గ కన్వీనర్ వర్కాల గోపాల్, దుబ్బ విగ్నేశ్వర్, జిల్లా సత్యం, మేకల బిక్షం, ఎస్కె షరీఫ్, ధనుంజయ పాల్గొన్నారు.

Advertisement

Next Story