వింబుల్డన్ కోసం కొత్త కోర్టు

by Shiva |
వింబుల్డన్ కోసం కొత్త కోర్టు
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నిర్వహించే ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ కొత్త కోర్టును నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఇప్పటికే సెంటర్ కోర్టు, కోర్ట్ 1 పేరుతో రెండు ప్రధాన కోర్టులు ఉన్నాయి. సెమీస్, ఫైనల్స్ లేదా స్టార్ టెన్నిస్ ప్లేయర్ల మ్యాచ్‌లను వీటిలో నిర్వహిస్తుంటారు. అయితే కొత్తగా నిర్మించబోయే షో కోర్ట్ పైన కప్పుతో పాటు మరింత మంది ప్రేక్షకులు కూర్చునే విధంగా ఉంటుందని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సమీపంలోని 73 ఎకరాల స్థలంలో ఈ కొత్త కోర్ట్ నిర్మించనున్నారు. ఈ కోర్టులో 8 వేల మంది కూర్చొని మ్యాచ్ చూసే అవకాశం ఉన్నది. 2030 కల్లా పూర్తయ్యే ఈ కోర్ట్ నిర్మాణం కోసం 65 మిలియన్ పౌండ్లను వెచ్చించి వింబుల్డన్ పార్క్ గోల్ఫ్ క్లబ్ నుంచి స్థలం సేకరించారు. వాస్తవానికి గత ఏడాదే నిర్మాణం ప్రారంభించాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. 2022 నుంచి దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ చెబుతున్నది.

Advertisement

Next Story

Most Viewed