- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వింబుల్డన్ నిర్వాహకులకు రూ. 1,079 కోట్ల బీమా సొమ్ము!
కరోనా మహమ్మారి కారణంగా అనేక ప్రధాన క్రీడా పోటీలు వాయిదా వేయగా.. ఒలింపిక్స్ క్రీడలను సైతం ఏకంగా ఏడాది పాటు వాయిదా వేయక తప్పలేదు. యూరోప్‌లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వింబుల్డన్ టోర్నీని కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా టోర్నీ వాయిదా పడటం వల్ల.. ఈ ఈవెంట్‌ను నిర్వహించే ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్‌కు 114 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో రూ.1,079 కోట్లు) బీమా సొమ్ము అందనుంది. షెడ్యూల్ ప్రకారం వింబుల్డన్ జరిగుంటే ఆ క్లబ్‌కు 250 మిలియన్ పౌండ్లు అనగా భారత కరెన్సీలో 23,100 కోట్ల రూపాయల ఆదాయం లభించేది. కానీ కరోనా మహమ్మారి కారణంగా పోటీలు వాయిదా పడటంతో.. ప్రస్తుతం వచ్చే కొద్దిపాటి బీమా సొమ్ముతోనే సర్ధుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వింబుల్డన్ పోటీలను రద్దు చేయడం ఇదే తొలిసారి. వింబుల్డన్‌కు 2003 నుంచి బీమా తీసుకుంటున్నారు. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సార్స్ వ్యాధి ప్రబలింది. దీంతో అప్పటి నుంచి బీమా చేయిస్తున్నారు. బీమా తీసుకున్న తర్వాత తొలిసారిగా కరోనా కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ వాయిదా పడింది.
Tags: Wimbledon, Insurance, tennis club, second world war, Europe