ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా ?

by Shyam |
teenmar
X

దిశ వికారాబాద్: తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, అప్రజాస్వామిక చర్యని మల్లన్న టీం వికారాబాద్ కన్వీనర్ మొగులప్ప అన్నారు. దళిత, బహుజనుల హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జర్నలిస్టు తీన్మార్ మల్లన్నని అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాల, హామీలపై మాట్లాడితే అక్రమ కేసులా, ప్రశ్నించే గొంతుక జర్నలిస్టు క్యూ న్యూస్​యూట్యూబ్​చానల్ అధినేత తీన్మార్ మల్లన్న ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.

ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మల్లన్నపై గత కొద్దీ రోజులుగా ప్రభుత్వం కుట్రతో సంబంధం లేని అక్రమ కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ నిన్న రాత్రికి రాత్రి అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అవుతుందన్నారు. ప్రజల సమస్యలపై ప్రతిరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని చూసి, ప్రజల దగ్గర నుంచి మల్లన్నకు వస్తున్నా ఆదరణను చూసి, ప్రశ్నించే గొంతుక లేకుండా చేయాలనే కుట్రతోనే ప్రభుత్వం తప్పుడు కేసులతో అరెస్ట్ చేసిందన్నారు. వెంటనే తీన్మార్ మల్లన్నను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story