- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓవర్ టు 2024 ఎలక్షన్! విపక్షాలు ఏకం అయ్యేనా?
బెంగాల్‌లో సీఎం మమతాబెనర్జీకీ, వామపక్షాలకు పొసగదు. కేరళలో కాంగ్రెస్‌కు, వామపక్షాలకు కుదరదు. కేరళలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాపకింద నీరులా విస్తరిస్తున్నదని అంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతో షిండే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం శరద్‌పవార్ ఎన్‌సీపీ, కాంగ్రెస్, ఉద్దవ్‌ఠాక్రే బలపడినట్లు కనిపిస్తున్నది. వీరిక్కడ త్వరలో జరుగనున్న బాంబే మున్సిపల్ కౌన్సిల్ (బీఎంసీ) ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, యూపీలో అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి బీఎస్‌పీ, ఇలా ఎక్కడి వారు అక్కడ యూనిటీగా ఏర్పడి 2024లో బీజేపీని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో 190 కి పైగా సీట్లు సునాయాసంగా సాధించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌కు సీట్ల సమీకరణ, విపక్షాల ఓట్లు చీలకుండా చూసుకోవడం అవసరం. కాంగ్రెస్ ప్రభావం 160 సీట్ల మీద ఉంటుంది.
దేశంలోని ప్రతీ రాజకీయ పక్షం 2024 వైపే పయనిస్తున్నది. అన్ని దారులు ఢిల్లీ గద్దె కోసమే కదులుతున్నాయి. సత్తా చూపడానికే అందరూ ప్రయత్నిస్తున్నారు. పర్సెప్షన్ కోసం లడాయి కనిపిస్తున్నది. 1977 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రతిపక్షాలను ఒక్కటి చేసిన పాత్రను ఇప్పుడు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ చేపడుతున్నట్లు కనిపిస్తున్నది. ఆయన కింగ్ అవుతారా లేక కింగ్ మేకర్ అవుతారా తేలాల్సి ఉంది. తాను 2024లో ప్రధాని అభ్యర్థిని కాబోనని మాత్రం చెప్పేసారు. బీజేపీ మీద వార్ ప్రకటించి 'బీజేపీ ముక్త్ భారత్' స్లోగన్ ఎత్తిన తెలంగాణ సీఎం కేసీఆర్ బిహార్ వెళ్లి నితీశ్‌కుమార్, తేజస్వీయాదవ్, లాలూప్రసాద్ యాదవ్‌ను కలిసి వచ్చారు. జాతీయ రాజకీయాలలోకి వెళుతున్నామంటూ నిజామాబాదు బహిరంగ సభలో ప్రకటించారు. దేశమంతటా ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. జాతీయ పార్టీని ప్రకటిస్తారనే సంకేతాలు కేసీఆర్ మాటలలో కనిపిస్తున్నాయి.
2024లో దేశంలో ప్రభుత్వం మార్పు కోసమే తాను బయలుదేరానని నితీశ్‌కుమార్ చెబుతున్నారు. ఓంప్రకాష్ చౌతాలా, అఖిలేష్ యాదవ్, సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, శరద్‌పవార్, కేజ్రీవాల్ తదితరులను నితీశ్‌కుమార్ కలిశారు. 2024లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండబోదని, పీఎం నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండబోరని నితీశ్‌కుమార్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. నితీశ్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని కూడా కలిశారు. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ డిసెంబర్‌లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది. పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనీ, నిరుద్యోగులకు మూడు వేల రూపాయల భృతి ఇస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉంటుందని కేజ్రీవాల్ హామీ ఇస్తున్నారు. ఈ పద్ధతిలోనే ఆయన దేశాన్ని ప్రభావితం చేసే పనిలో ఉన్నారు.
క్రమక్రమంగా బలపడుతూ
బెంగాల్‌లో సీఎం మమతాబెనర్జీకీ, వామపక్షాలకు పొసగదు. కేరళలో కాంగ్రెస్‌కు, వామపక్షాలకు కుదరదు. కేరళలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాపకింద నీరులా విస్తరిస్తున్నదని అంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతో షిండే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం శరద్‌పవార్ ఎన్‌సీపీ, కాంగ్రెస్, ఉద్దవ్‌ఠాక్రే బలపడినట్లు కనిపిస్తున్నది. వీరిక్కడ త్వరలో జరుగనున్న బాంబే మున్సిపల్ కౌన్సిల్ (బీఎంసీ) ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, యూపీలో అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి బీఎస్‌పీ, ఇలా ఎక్కడి వారు అక్కడ యూనిటీగా ఏర్పడి 2024లో బీజేపీని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో 190 కి పైగా సీట్లు సునాయాసంగా సాధించే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ 2014, 2019లో 44-52 సీట్ల వద్ద ఆగిపోయినా, 2014లో 10 కోట్ల 59 లక్షల ఓట్లు సాధించింది. 2019లో 11 కోట్ల 94 లక్షల ఓట్లు సాధిందించింది. ఓట్ల సాధనలో బీఎస్‌పీ మూడో స్థానంలో ఉంది. దళితుల ఓట్లు సాధించడంలో ఆ పార్టీ ముందుంటుంది. అందుకే ఆ పార్టీని తక్కువగా అంచనా వేయవద్దు. కాంగ్రెస్‌కు 19.5 శాతం ఓట్లు సాధించే సత్తా ఉంది. 2019లో బీజేపీ 31 నుంచి 32 శాతం ఓట్లు సాధించింది. సమాజ్‌వాదీ పార్టీకి 2.6, ఆప్‌కు 0.4 , సీపీఐకి 0.6, సీపీఎంకు 1.8, జేడీయూకు 1.5, జేడీఎస్‌కు 1.06 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్‌కు సీట్ల సమీకరణ, విపక్షాల ఓట్లు చీలకుండా చూసుకోవడం అవసరం. కాంగ్రెస్ ప్రభావం 160 సీట్ల మీద ఉంటుంది. నిజానికి 2014లో కాంగ్రెస్ సహా విపక్షాల ఓట్లు 69 శాతం ఉంటే, 2019లో 63 శాతం ఉంది.
కలిసిపోతేనే మేలు
ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్‌ను కూడా కలుపుకోవాలి. ఎన్నికల ముందు కాకున్నా తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చే విధంగా విపక్షాలతో అవగాహన ఉండాలి. కర్ణాటకలో జేడీఎస్‌లాంటి పార్టీలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. జేడీఎస్ నేత కుమారస్వామిని కూడా నితీశ్ కలిసి చర్చించారు. బీజేపీకి పొలిటికల్ ఫండ్ కొరత లేదు. అంబానీ, అదానీ బీజేపీ దిక్కే ఉన్నారు. ఒక రాహుల్‌గాంధీ తప్ప కేజ్రీవాల్ సహా ఎవ్వరు కూడా కార్పొరేట్‌లను ఒక్క మాటా అనడం లేదు. 2024లో బీజేపీని ఢీ కొట్టే పరిస్థితి ఉందంటేనే విపక్షాలకు కార్పొరేట్‌లు మద్దతు ఇస్తాయి. ఫండింగ్ ఉంటుంది.రాహుల్‌గాంధీ 'భారత్ జోడో యాత్ర'కు దేశంలో మంచి రెస్పాన్స్ వస్తున్నది. రైతు నాయకుడు యోగేందర్ యాదవ్ లాంటి వారు, ఇతర ప్రోగ్రెస్సివ్ శక్తులు కలిసి రావడం మంచి పరిణామం.
పెరిగిన ధరలు, నిరుద్యోగం, అసమానతలు, ప్రశ్నించేవారి మీద నిర్బంధాలు, విపక్షాల మీద ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు, ఎమ్మెల్యేల కొనుగోలు, విపక్ష ప్రభుత్వాల కూల్చివేత, బీజేపీ నేతల విచ్చలవిడితనం లాంటి వ్యవహారాలను ప్రజల ముందు పెడితే 2024 లో మార్పు తధ్యం అనే టాక్ వచ్చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగనున్న ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ అంశాలు ముఖ్యం
బిహార్‌లో 51 శాతం పేదరికం ఉంటే, గుజరాత్ లో 18 శాతం పేదరికం ఉంది. సీఎంఈఐ నివేదిక ప్రకారం ఈ ఏడు రాష్ట్రాలలో 12 శాతం నిరుద్యోగం నమోదు అయింది. హర్యానాలో 37.3, రాజస్థాన్‌లో 31.4, జమ్మూ-కాశ్మీర్‌లో 32.3 నిరుద్యోగం నమోదైంది. ఆగస్టులో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన పీఎం నరేంద్ర మోడీ ఇప్పటి దాకా కనీసం 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. రూ.135 లక్షల కోట్ల అప్పు ఉంది. 2024 ను ప్రజలు ఎలా తీసుకుంటారో? ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సైతం బెంగాల్ మాదిరి బీజేపీ సిద్ధం అవుతున్నది. మునుగోడు ఉప ఎన్నికను సెమీ ఫైనల్‌గా తీసుకున్నది. మైండ్ గేమ్ ఆడుతున్నది.
ఎండీ మునీర్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99518 ౬౫౨౨౩
Also Read : ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా రూట్ మార్చుకున్న బీజేపీ?