- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు నిధులిస్తారా..?
దిశ, తెలంగాణ బ్యూరో : సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నిధులు అవసరమవుతున్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పనులు నెమ్మదించాయి. కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రాజెక్టులను రీ డిజైన్ చేసిన ప్రభుత్వం.. లక్షల కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు తగ్గిస్తూ ప్రాజెక్టు పనులే చేసింది. వేల కోట్ల అప్పులు తెచ్చింది. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 70 శాతం పూర్తి అయింది. అదనపు టీఎంసీ పనులు కూడా అంతే. ఈ ఏడాది కచ్చితంగా డిండి, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఉంది. మరి ఆశలు నెరవేరుతాయా? కేంద్రం నేటి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తుందా?
ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం నుంచి నిధుల సహకారం అందుతుందా.. అనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి నిధుల సాయం లేకుంటే ప్రాజెక్టులపై ముందుకు వెళ్లడం కష్టమనే అంటున్నారు. అందుకే కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం సఖ్యతగా ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. ఒకవేళ అనుకున్నట్టుగానే కేంద్రం నేడు బడ్జెట్‌లో ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే కేంద్ర, రాష్ట్రాల దోస్తానాపై క్లారిటీ వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్రం నుంచి మాత్రం నిధుల కోసం.. సాయం కోసం లేఖలు పంపిస్తూనే ఉంది. ఇక ఈసారి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పథకాలు, మిషన్ భగీరథ కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని విజ్ఞప్తి ధోరణితోనే డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.40,169.20 కోట్లు, మిషన్ భగీరథ నిర్వహణకు కనీసం రూ.12,772 కోట్లు సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. 14వ ఆర్థిక సంఘం గతంలో నిధులివ్వాలని సిఫారసు చేసిన విషయాన్ని కూడా కేంద్రానికి గుర్తు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులివ్వాలని నీతి అయోగ్ సిఫారసు చేసింది. భారీ ఖర్చుతో చేపట్టిన ఈ పథకాలకు సాయం చేయాలని సూచించింది. ఆశించినట్టుగానే ఈసారి బడ్జెట్ లో తగినన్ని నిధులు, సహకారం ఉంటే ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కుతామనే ధీమాతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇలా కేంద్ర బడ్జెట్‌పై ప్రతిసారి ఆశలు పెట్టుకుంటున్నా.. ఉత్తిచేయి చూపిస్తున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటే నిధుల అంశంలో కష్టాలు తప్పేలా లేవు.
కాళేశ్వరానికి జాతీయ హోదా
గోదావరి నుంచి సాగునీటిని అందించేందుకు భారీ ఎత్తున నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇంటింటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు, చెరువుల పునరుద్ధరణకు రూ.5 వేల కోట్లు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ రెండు పథకాలకు తగినంత ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్ కూడా సిఫారసు చేసింది. వీటితో పాటు బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్‌కు నిధుల కోసం మొదట్నుంచీ రాష్ట్రం నుంచి అడుగుతూనే ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం కూడా చేశారు.
ఆశలలో స్టేట్ సర్కారు
సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మీద స్టేట్ గవర్నమెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. వివిధ సందర్భాలలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతోంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తాను, ఇతర మంత్రులు రాసిన లేఖలను పార్లమెంటులో లేవనెత్తాలని పార్టీ ఎంపీలకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. ఇటీవల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. స్వయంగా వెళ్లి విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ, టెక్స్‌టైల్ పార్క్, నిమ్జ్, ఐటీఐఆర్, నేషనల్ డిజైన్ సెంటర్ వంటి వాటికి నిధుల మంజూరు అంశాలను ప్రస్తావించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. విభజన చట్టం ప్రకారం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, ట్రైబల్ యూనివర్సిటీ, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ, రోడ్, రైల్వే ప్రాజెక్టులు, బయ్యారం స్టీల్ ప్లాంటు వంటి అంశాలను టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రస్తావించనున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్‌తో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మనోహరాబాద్–కొత్తపల్లి, అక్కన్నపేట–మెదక్, భద్రాచలం–కొత్తగూడెం లైన్లకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, సర్వేలు, పలు జాతీయ రహదారుల కోసం కేంద్రంపై భారీ ఆశలు పెట్టుకున్నది.
ఇవ్వకుంటే కష్టమే
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంలో నిర్ణయం తీసుకుని, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలకు నిధులు రాకుంటే తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు పెరగనున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం పనులలో వేగం తగ్గింది. నిధులు లేమి. తెచ్చిన అప్పులకు వేల కోట్లు మిత్తీల కింద చెల్లించాల్సి వస్తోంది. రోజువారీ నిర్వహణకే అప్పులపై నెట్టుకొస్తోంది. పీఆర్సీ నివేదికలో కూడా రాష్ట్రం అప్పుల పరిస్థితిని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలనేదే ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం. ఆయా ప్రాజెక్టులకు కనీసం రూ.10 వేల కోట్లకుపైగా పెండింగ్ బిల్లులున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాకుంటే పనులెలా ముందుకు తీసుకెళ్లాలనేది సాహసోపేతమైన అంశమే. సీఎం కేసీఆర్ మాత్రం ఈ ప్రాజెక్టులపై స్పష్టమైన నిర్ణయంతోనే ఉన్నారు. రాష్ట్రానికి ఓ భారీ రైల్వే ప్రాజెక్టును మంజూరు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు ఒకేసారి రూ.వెయ్యికోట్లు, ఖాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, రైల్వే ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఐఐఎస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుంచింది. వీటన్నింటికీ ఈసారి బడ్జెట్‌లో తగినన్ని నిధులు, సహకారం ఉంటే ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కుతామని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.