ముధోల్‌లో అడవి పందుల బీభత్సం.. ఒక్కసారిగా దూసుకొచ్చి..!

by Aamani |
wild-pigs-hulchal 1
X

దిశ, ముధోల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తానూర్ మండల కేంద్రంలో గల బస్టాండ్ ప్రాంతంలో అడవి పందులు హల్‌చల్ చేయడంతో పాటు బీభత్సం సృష్టించాయి. తానూర్ బస్టాండ్ ప్రాంతం నుంచి బైంసా వెళ్ళే రోడ్డు పక్కన గల పలు దుకాణాల్లో చొచ్చుకుపోయి అరాచకం సృష్టించాయి. పందుల బీభత్సం వలన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఒకే సారి పందుల గుంపు దుకాణాల్లోకి చొచ్చుకు పోవడంతో చుట్టుపక్కల గందరగోళం నెలకొంది. షాపులోని సామన్లు చిందరవందరగా పడిపోయాయి.అనంతరం అక్కడి నుంచి పందుల గుంపు అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు సమాచారం.

Advertisement

Next Story