రేగ‌ళ్లలో అడ‌వి దున్న సంచారం

by Sridhar Babu |
రేగ‌ళ్లలో అడ‌వి దున్న సంచారం
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లందు క్రాస్ రోడ్డు రేగళ్ళ అటవి ప్రాంతంలో శ‌నివారం అడవిదున్న క‌నిపించింది. రోడ్డు మీద‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. వాహ‌న‌దారుల‌ను చూసి వెంట‌నే అడ‌విలోకి ప‌రుగెత్తింది. ఇటీవ‌లి కాలంలో అడ‌వి మృగాలు జ‌నార‌ణ్యంలోకి రావ‌డం ప‌రిపాటిగా మారింది. ఓవైపు రెండు పులులు, ఓ హైనా తిరుగుతున్నాయ‌ని జ‌నం భ‌యాందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో తాజాగా అడ‌వి దున్న సంచారం మ‌రింత భ‌యాన్ని పెంచింది.

Advertisement

Next Story