- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తకు షాక్.. భర్తపై వలంటీర్‌కి ఫోన్ చేసిన భార్య
కరోనా వైరస్ ఆందోళన తీవ్రతను తెలియజేసే ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే… ఓ వ్యక్తి నెల్లూరులో స్వర్ణకారుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నెల్లూరు కరోనా తీవ్రత అధికంగా ఉండడానికి తోడు లాక్‌డౌన్ గడువు పెరగడం నేపథ్యంలో భార్యాపిల్లలతో గడిపేందుకు వెంకటగిరిలోని బంగారుపేటలో ఉన్న తన ఇంటికి వచ్చాడు.
ఆశగా ఇల్లు చేరిన ఆయనను భార్య ఇంట్లోకి రానివ్వలేదు. కరోనా పరీక్షలు చేయించుకుంటే కానీ ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేది లేదంటూ తెగేసి చెప్పింది. అంతటితో ఆగకుండా స్థానిక వలంటీర్‌కు కూడా ఫోన్ చేసింది. దీంతో వాలంటీర్ ఇచ్చిన సమాచారంతో… వైద్య సిబ్బంది, పోలీసులు వచ్చి ఆయనను క్వారంటైన్‌కు తరలించారు.
అయితే ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ఆయన ఇల్లు చేరాడు. అనంతరం ఆయన భార్య మాట్లాడుతూ, తమ పిల్లలతో పాటు, చుట్టుపక్కల వారి ఆరోగ్యం కోసమే తాను ఫిర్యాదు చేశానని తెలిపింది.
tags:nellore district, wife, husband, goldsmith, venkatagiri, corona fear