వేధింపులు భరించలేక మర్డర్ చేసిన సరోజ

by Sumithra |
వేధింపులు భరించలేక మర్డర్ చేసిన సరోజ
X

దిశ, వెబ్‌డెస్క్: వేధింపులు తాళలేక విసిగిపోయిన ఓ మహిళ కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసింది. మేడ్చల్ జిల్లాలో ఆదివారం జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సరోజ అనే మహిళకు కీసర మండలం నాగారానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు సాఫీగానే సంసారంలో గొడవలు మొదలయ్యాయి. ఇదేక్రమంలో భర్త తాగుడుకు బానిసై వేధిస్తుండటంతో విసిగిపోయిన సరోజ… ఇంట్లో ఉన్న రోకలిబండతో భర్త తలపై మోదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితురాలు సరోజను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story