దారుణం : భర్త చేసే పనికి.. విసుగు చెందిన భార్య ఏం చేసిందో తెలుసా ?

by Sumithra |   ( Updated:2021-11-21 23:57:47.0  )
దారుణం : భర్త చేసే పనికి..  విసుగు చెందిన భార్య ఏం చేసిందో తెలుసా ?
X

దిశ, హన్మకొండ చౌరస్తా : సోదరుని సహకారంతో భార్య భర్తను హత్య చేసిన ఘటన హన్మకొండ జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. గత కొన్ని నెలలుగా కాలనీలో నివాసం ఉంటున్న గన్నేరు శంకర్ మద్యానికి బానిసై, తరచూ భార్య సుజాతతో గొడవ పడుతూ ఉండేవాడు. దీంతో ఆ వేధింపులు తాళలేక విసుగు చెందిన సుజాత, తన సోదరుడితో విషయం చెప్పడంతో ఆదివారం రాత్రి సోదరుడి సహకారంతో భర్త శంకర్‌ను ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసి ఉంటారని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

epaper – MORNING EDITION (22-11-21) చదవండి

Advertisement

Next Story