- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి కోసం ప్రియురాలి దారుణం..
దిశ,వెబ్‌డెస్క్ : ప్రియుడి కోసం కట్టుకున్న వాడినే కడతేర్చింది కసాయి భార్య. ప్రియుడి మోజులో పడి పక్కా ప్లాన్ ప్రకారం భార్య, భర్తను హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లోని బిజ్జూ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. సునీత దంపతులు బిజ్జూ గ్రామంలో నివసిస్తున్నారు. సునీత నిహాల్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించింది. దాంతో వారి ప్రేమకు తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సునీత, పక్కా ప్లాన్ ప్రకారం.. తన భర్త తాగే మద్యంలో నిద్రమాత్రలు కలిపింది. అయినా అతను చావలేదు.
దీంతో అతను చావలేదని నిర్ధారించుకుని, తనను ఎలాగైనా చంపాలని పథకం ప్రకారం తన ప్రియుడితో కలసి సృహా కోల్పోయిన వ్యక్తికి కరెంట్ షాకిచ్చి చంపేసింది. అనంతరం బంధువులకు విషయం చెప్పింది. అలాగే తన భర్త మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా అంత్యక్రియలు జరిగేలా ప్లాన్ చేసింది. కానీ సునిత చేష్టలు పసిగట్టిన భర్త తరఫున బంధువులు, అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. సునీతనే తన ప్రియుడు నిహాల్ సింగ్‌తో తన భర్తను చంపిందని తెలుసుకున్న బంధువులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో పోలీసులు నిందుతులను అదుపులోకి తీసుకొని కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.