- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటికి రాగానే అవి చూసి షాకైన భర్త.. బాత్‌రూమ్, బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరా ఫుటేజీ చూసి..
దిశ, వెబ్‌డెస్క్ : వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డు మీదకు తెస్తున్నాయి. కొన్ని క్షణాల సుఖం కోసం తమ బంగారు భవిష్యత్తును కొందరు నాశనం చేసుకుంటున్నారు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఓ భార్య వ్యవహారాన్ని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. టెక్నాలజీ సాయంతో బట్టబయలు చేశాడు. చివరకు కోర్టును ఆశ్రయించి ఆమె నుండి విడాకులు పొందాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.?
వివరాల ప్రకారం.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి(31).. భార్య, మూడేళ్ల కూతురితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్నాడు. సజావుగా సాగిపోతున్న వారి కాపురంలోకి ఓ వ్యక్తి ఎంటర్ అయ్యాడన్న విషయాన్ని సదరు వ్యక్తి గుర్తించాడు. ఓరోజు అనుకోకుండా భార్యపై భర్తకు అనుమానం కలిగింది. తన ఇంట్లో సిగరెట్ ముక్కలు ఉండడం గమనించి భర్త షాకయ్యాడు. ఇంట్లో సిగరెట్ తాగేవాళ్లు ఎవ్వరూ లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆ భర్త ఈ విషయమై భార్యను నిలదీస్తే.. తనకేమీ తెలియదంటూ ఆమె బుకాయించింది.
దీంతో తీవ్రంగా ఆలోచించిన సదరు భర్త.. భార్యపై ఓ కన్నేసి ఉంచాడు. ఇంట్లో ఆమెకు తెలియకుండా సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. భార్య ఫోన్‌ను సైతం టెక్నాలజీ సాయంతో ట్రాప్ చేశాడు. అంతకు ముందే భర్త ఆమెను నిలదీయడంతో.. భార్య కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్నట్లు నటించింది. వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చి.. కొద్దిరోజుల తర్వాత ఆమె తన బాయ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, వచ్చేటప్పుడు గర్భ నిరోధక మాత్రలు తెమ్మని చెప్పింది. ఫోన్‌కు వచ్చిన మెసేజ్ సాయంతో ఈ విషయం భర్తకు తెలిసింది.
దీంతో షాక్ నుంచి తేరుకున్న భర్త.. తన ప్లాన్ అమలు చేశాడు. బాత్ రూమ్‌లో, లివింగ్ రూమ్‌లో, బెడ్ రూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు పని చెప్పాడు. దీంతో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఆమె సాగించిన రాసలీలలన్నీ రికార్డు చేశాడు. ఆ వీడియో ఫుటేజీలను పట్టుకొని నేరుగా కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే తనకు విడాకులు కావాలని కోర్టుని కోరాడు. వీడియోను పరిశీలించిన కోర్టు వారికి విడాకులు మంజూరు చేసి.. పాప బాధ్యతను తండ్రికి అప్పగించింది.