హనీ ట్రాప్..మిత్రుడి పేరుతో భర్త చాటింగ్

by Shyam |

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మరో హనీ ట్రాప్ బాగోతం వెలుగుచూసింది. వ్యసనాలకు బానిస అయిన భర్త సంతోష్ డబ్బు కోసం కట్టుకున్న భార్యకు ఆమె స్నేహితుడిలాగా చాటింగ్ చేశాడు. ఈ వ్యవహారం కొద్ది రోజులు నడిచాక తన అసలు రంగు బయట పెడ్డాడు. అసభ్య కరమైన మెసేజ్‌లు, అశ్లీల వీడియోలు భార్యకు పంపించి వేధింపులకు గురిచేశాడు. తనకు డబ్బులు ఇవ్వాలని లేనియెడల ఈ చాటింగ్ వ్యవహారం అందరికీ చెబుతానని బెదిరించి ఆమె నుంచి రూ.కోటి వసూలు చేశాడు. కొద్ది రోజులు సైలంట్ అయిన సంతోష్ తిరిగి బ్లాక్ మెయిలింగ్‌కు దిగడంతో అనుమానం వచ్చిన ఆ వివాహిత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుడు బాధితురాలి భర్తగా తేలింది. ఈ విషయం తెలియడంతో ఆమె కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. అంతేకాకుండా సంతోష్ గతంలో కూడా పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురిచేసినట్టు సమాచారం. చెడు వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని అతను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని ఏసీపీ శ్యామ్ వెల్లడించారు.

Advertisement

Next Story