పోలీస్ స్టేషన్ సాక్షిగా పెళ్లి.. ఇంతలోనే భర్త ఏం చేశాడంటే ?

by Aamani |   ( Updated:2021-10-28 01:45:42.0  )
పోలీస్ స్టేషన్ సాక్షిగా పెళ్లి.. ఇంతలోనే భర్త ఏం చేశాడంటే ?
X

దిశ, ఇందల్వాయి : ప్రేమించి పెళ్లి చేసుకుని భర్త మోసం చేశాడంటూ భార్య, భర్త ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగిన ఘటన ఇందల్వాయి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన గోపిరెడ్డి మౌనిక (21)ను అదే గ్రామానికి చెందిన పాత శ్రావణ్ (27) గత రెండు సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. పోలీస్ స్టేషన్ సాక్షిగా 2020లో పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం నుంచి హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో సహజీవనం చేస్తున్నారు.

ఈ క్రమంలో భర్త శ్రావణ్ తరచూ మానసికంగా, శారీరకంగా వేధిస్తుడడంతో ఆ బాధలు భరించలేక భార్య మౌనిక భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. తనను ఇప్పుడు వద్దంటున్నాడని రోదిస్తూ తెలిపింది. కూకట్ పల్లిలో తనపై పలుమార్లు అతికిరాతకంగా దాడిచేశాడని, అత్తమామలు సైతం తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన బావ రవికాంత్ (34)తనపై ఉదయం దాడి చేసి కొట్టాడని, తన భర్త తనను ఇలా మోసం చేస్తాడని అనుకోలేదని వాపోయింది. పోలీస్ స్టేషన్లో గత రెండు నెలల క్రితం ఫిర్యాదు చేసినా తనకు ఇప్పటి వరకు న్యాయం జరుగడం లేదని రోదిస్తూ తెలిపింది. ఇకనైనా తనకు న్యాయం జరిగేలా చుడాలని పోలీసులను వేడుకుంది.

Advertisement

Next Story