- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్‌లైన్ ప్రేమ.. ఆర్య సమాజ్‌లో పెళ్లి.. సీన్ కట్ చేస్తే..!
దిశ హుజురాబాద్, రూరల్ : ఆన్‌లైన్ ప్రేమ ఓ మహిళ కొంపముంచింది. ప్రేమించుకున్నారు, ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందని అనుకోనులోపే ఏమైందో తెలియదు గానీ, బాధితురాలు భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన కరీంనగర్‌లో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపకు చెందిన సుహాసిని, తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన సుజిత్ ‘యాహు డాట్ కామ్’ ద్వారా పరిచయమై ఆన్ లైన్ చాటింగ్‌లో మునిగితేలారు. కొన్ని రోజుల తరువాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమ గురించి చెప్పుకున్నారు. కట్ చేస్తే ఏడాది కిందట హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు కడప, తిరుపతి, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో అతిథి గృహాల్లో భార్యాభర్తలుగా కొనసాగుతూ వచ్చారు.
అయితే, ఈ విషయం తెలిసే సరికి ఇంట్లో గొడవలు అవ్వగా.. కొన్ని రోజుల కిందటే ఇరువురి కుటుంబ సభ్యులు రాజీ కుదుర్చుకున్నారు. పెళ్లికి ఓకే చెప్పారు. త్వరలోనే మా ఇంటికి తీసుకెళ్తానని భర్త చెప్పడంతో ఆ మాటలు భార్య, ఆమె కుటుంబ సభ్యులు కట్నంగా కొంత డబ్బు కూడా అల్లుడికి సమర్పించుకున్నారు. ఏమైందో తెలియదు సుజిత్ భార్యతో మాట్లాడటం మానేశాడు. ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు. భార్యను కాపురానికి తీసుకెళ్లడానికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన సుహాసిని భర్త సుజిత్ గురించి ఆరా తీయగా వరంగల్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఇన్చార్జిగా చేస్తున్నట్టు తెలుసుకుంది. కాగా, సుజిత్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో ఉంటున్నట్టు అడ్రస్ తెలుసుకుని అతని ఇంటి ముందు బైఠాయించింది. సుజిత్ తనను భార్యగా అంగీకరించే వరకు పోరాటం చేస్తానని శుక్రవారం అతని ఇంటి ముందు నిరసన దీక్షకు దిగింది. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.