50 ఏళ్ల వయస్సులో కూతురు భర్తపై కన్నేసిన తల్లి.. అల్లుడితో రొమాన్స్ కోసం..

by Sumithra |   ( Updated:2021-08-01 03:37:32.0  )
50 ఏళ్ల వయస్సులో కూతురు భర్తపై కన్నేసిన తల్లి.. అల్లుడితో రొమాన్స్ కోసం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. కామ కోరికలు ఎక్కువై వావి వరుసలను మరిచి ప్రవరిస్తున్నారు. తల్లి, చెల్లి, అత్త, కోడలు ఇలాంటి బంధాలకు ఉండే విలువను కొంతమంది కామాంధులు తమ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. వారి కామ క్రీడలకు అడ్డుగా ఎవరైనా ఉంటే వారిని అడ్డు తొలగించుకోవడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. తాజాగా ఓ అత్త , తన అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని సొంత భర్తను హతమార్చింది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రంగయ్యచెరువు ఎస్టీకాలనీలో నాగరాజు(51), మంజుల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రాణి(26) అనే కూతురు ఉంది. ఆమెను బంగారుపాళ్యం మండలం చిట్టేరికి చెందిన సుబ్రహ్మణ్యానికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత అప్పుడప్పుడు మంజుల కూతురి ఇంటికి వెళ్తూపోతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే అత్త మంజుల అల్లుడు సుబ్రహ్మణ్యంకు దగ్గరయింది. శారీరక సంబంధం పెట్టుకుంది. మూడేళ్ళుగా ఎవరికి తెలియకుండా వివాహేతర సంబంధాన్నిఅత్తాఅల్లుడు కొనసాగిస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే గత ఆదివారం కూతురి ఇంటికి వచ్చిన మంజులను తీసుకెళ్లడానికి భర్త నాగరాజు మూడు రోజుల క్రితం వచ్చాడు. ఇక భర్త రావడంతో అల్లుడితో కలిసి ఉండలేనని.. దానికి కారణం భర్తే అని ఆమె కక్ష కట్టింది. దీంతో ఎలాగైనా తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అదే విషయాన్ని ప్రియుడు, అల్లుడు అయిన సుబ్రహ్మణ్యానికి తెలిపింది. అతను కూడా సరే అనడంతో పక్కా ప్లాన్ ప్రకారం నాగరాజును కంచెంవారిపల్లె సమీపంలో అడవిలోకి తీసుకెళ్లారు.

అతడితో ఫుల్లుగా మద్యం తాగించి, అతను మత్తులో పడిపోయాకా రాళ్లు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. అనంతరం వడ్లవాడి కుంటలో పడేసి వెళ్లిపోయారు. ఇక, అక్కడ నాగరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ జరిపిన పోలీసులు మంజుల, సుబ్రహ్మణ్యంలను నిందితులుగా గుర్తించారు. తమ పద్దతిలో అడిగేసరికి భర్తను తామే చంపామని అత్త మంజుల ఒప్పుకొంది. శనివారం అరెస్ట్ చేసిన వీరిని సోమవారం కోర్టు లో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story