అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని…

by Sumithra |
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని…
X

దిశ, దుబ్బాక: తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను తన ప్రియుడితో కలిసి కడతేర్చిందో భార్య. ఈ ఘటన తొగుట మండలం ఎల్లారెడ్డిపేట-తుక్కాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం…మద్దూరు మండలం హన్మతాండకు చెందిన భూక్యా మోహన్ (33) కూలీ పని చేసి జీవనం సాగిస్తున్నాడు. అతడికి 12 ఏండ్ల క్రితం భూక్యా వినోదతో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కాగా రెండేండ్ల క్రితం బతుకుదెరువు కోసం సిద్దిపేటకు వీరు మకాం మార్చారు. మోహన్ సిద్దిపేటలో హోటల్ పనికి కుదరగా, వినోద మేస్త్రీ వద్ద కూలీ పనికి వెళ్ళేది. కొండపాక మండలం మర్పడగ గ్రామానికి చెందిన మేస్త్రీతో ఆమె విహాహేతర సంబంధం పెట్టుకుంది.

వారి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మోహన్‌ను చంపాలని ప్లాన్ వేశారు. ఈనెల 10న భార్యా భర్తలిద్దరూ స్వగ్రామానికి వెల్లి అదే రోజు రాత్రి తిరిగి సిద్దిపేటకు చేరుకున్నారు. అతనికి బాగా మద్యం తాగించి… మరుసటి రోజు ఉదయం మోహన్‌ను ఆమె తన ప్రియునితో కలిసి బండి మీద ఎల్లారెడ్డి పేట అటవీ శివారులోకి తీసుకు వెళ్లారు. అతనికి ఊపిరి ఆడకుండా చేసి చంపి కొత్తకుంటలో పడేసి వెళ్లిపోయారు. తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు.. భర్త కనిపించడం లేదంటూ మద్దూరు పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై విచారణ జరిపి నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story