- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇళ్లు కట్టి, బంగారం పెట్టాడని భర్తను చంపిన భార్య
దిశ, జడ్చర్ల: పొలం అమ్మిన డబ్బుల కోసం కట్టుకున్న భర్తనే హత్య చేసింది భార్య. హత్యానంతరం సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చి పెట్టిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండలంలోని మొరంబాయి గ్రామానికి చెందిన చెన్నయ్య (48) దాదాపుగా రెండు నెలల నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయంపై మృతుని సోదరీమణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో భార్య రాములమ్మను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. తన భర్తను హత్య చేసి ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో పూడ్చిపెట్టినట్టు(హత్య చేసినట్టు) ఒప్పుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం తహసీల్దార్ రాజేందర్ రెడ్డి సమక్షంలో సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు. అనంతరం డాక్టర్ల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు.
తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్న మహిళ.. వైద్యపరీక్షతో షాకైన భర్తలు
డబ్బుల కోసమే హత్య..
కొంతకాలం క్రితం చెన్నయ్య తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో.. ఒక ఎకరం పొలాన్ని అమ్మాడు. ఆ డబ్బుతో ఇంటి నిర్మాణం చేపట్టి.. కొంతడబ్బుతో సోదరీమణులకు తులం బంగారం చొప్పున బహుమతిగా ఇచ్చాడు. ఇది నచ్చని భార్య రాములమ్మ తరచూ భర్తతో గొడవ పడుతూ ఉండేది. పొలం అమ్మిన దాంట్లో మిగిలిన డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా భర్తతో వాదించేది. ఇందుకు భర్త నిరాకరించడంతో రెండు నెలల క్రితం చెన్నయ్యను ఇంట్లోనే హత్య చేసింది. అనుమానం రాకుండా నూతనంగా నిర్మించిన ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో వేసి పూడ్చి పెట్టింది. ఇందుకు రాములమ్మ సోదరి భర్త సహకరించడం గమనార్హం. చెన్నయ్య హత్య కేసులో రాములమ్మ మరిది(చెల్లెలి భర్త)ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యతో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు.