ఆన్ లైన్ లో ప్రేమ.. చివరకు ఇంటిముందు ఇలా..

by Anukaran |   ( Updated:2021-11-27 04:57:36.0  )
ఆన్ లైన్ లో ప్రేమ.. చివరకు ఇంటిముందు ఇలా..
X

దిశ, హుజురాబాద్ రూరల్: కడప జిల్లాకు చెందిన సుహాసిని, హుజురాబాద్ కు చెందిన సుజిత్ ఒకరినొకరు ఆన్ లైన్ లో ఇష్టపడ్డారు. కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత హైదరాబాద్ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం పాటు వివిధ ప్రదేశాలలో భార్య భర్తలుగా చలామణి అయ్యారు. తర్వాత సుజిత్ తాను జీవితంలో స్థిర పడాలని, ఇంట్లో పెద్దలను ఒప్పించాలని, ఆమెకు మాయమాటలు చెప్పి తప్పించుకు తిరగడం మొదలు పెట్టాడు. చివరగా ఎన్ని రోజులు ఇలా తిరుగుతావ్ అని అడిగితే నిన్ను ప్రేమించిన పాపానికి పెళ్లి చేసుకున్నాను, నాకు అదనం కట్నం కావాలి లేకపోతే వేరే అమ్మాయిని చేసుకుంటా అని కరాఖండిగా చెప్పేశాడు.

అప్పట్లో తనకున్న ఇంటి స్థలాలను అమ్మి డబ్బులు కూడా ముట్ట చెప్పింది. నాకు నా భర్తే సర్వస్వం అంటూ భర్త ఇంటి వరకు చేరుకుంది. విషయం తెలిసి భర్త ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దాంతో రెండు రోజులుగా భర్త ఇంటి ముందే చలిలో మౌన పోరాటం చేస్తోంది. బడాబాబుల అండదండలతో నా భర్త తప్పించుకు తిరుగుతున్నాడనీ, మహిళా సంఘాలు నాకు రక్షణగా నిలవాలి అని వేడుకుంటోంది.

Advertisement

Next Story

Most Viewed