- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడిపై మోజు పడింది..భర్తనే చంపించింది..
దిశ ప్రతినిధి, వరంగల్ : కామంతో ఆమె కండ్లు మూసుకుపోయాయి. వావి వరుసలు మరించింది. కొడుకులా భావించాల్సిన మరిదిని ప్రియుడిగా మార్చుకుంది. ఆపై భర్త అడ్డు తగులుతున్నాడని చెప్పి.. ప్రియుడు మరో ఇద్దరితో కలసి భర్తను చంపించేసింది.. ఏమీ తెలియనట్లు మిస్సింగ్ కేసు నమోదయ్యేలా చేసింది. అయితే పోలీసులు కిలేడీపై నిఘా ఉంచి.. అసలు దోషి ఆమె అని నిర్ధారించడంతో ఆమెతో పాటు మరో ముగ్గురిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. వరంగల్ కమిషనరేట్ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో గత నెల 24న జరిగిన హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనర్ ప్రమోద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం….వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన తాళ్ళపల్లి అనిల్-పూజితలు భార్యభర్తలు. అనిల్ ట్రాలీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే 2018లో తనకు తమ్ముడు వరుసయ్యే డ్యానీ వద్ద రూ.లక్షను అనిల్ అప్పుగా తీసుకున్నాడు.
ఆ తర్వాత క్రమంలో కొన్ని ఆర్థిక సమస్యలు ఏర్పడటంతో సకాలంలో ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడంలో ఆలస్యమైంది. అయితే ఆ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో ఇచ్చేలా అనిల్-డ్యానీల మధ్య ఒప్పందం కుదిరింది. రోజూ అనిల్ ఇంటికి వచ్చి డ్యానీ వాయిదా మొత్తాన్ని తీసుకెళ్లేవాడు. ఈక్రమంలోనే పూజితకు డ్యానీకి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి వివాహేతర సంబంధానికి తన ఇళ్లును ఇస్తూ డ్యాని అక్క సుధ సహకరించడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం వీరి వ్యవహారంపై అనిల్‌కు అనుమానం కలగడంతో భార్యను నిలదీశాడు. అయినా పద్ధతి మార్చుకోలేదు. అనిల్‌ను చంపేస్తేనే మన ఇద్దరం సుఖంగా ఉండగలమని డ్యానికి పూజిత సూచించింది. అనిల్‌ను చంపేయాలని నిర్ణయించుకుని వారిద్దరు పథకం రచించారు. ఇందుకు తన స్నేహితుడు అనిల్ సహకరించేలా డ్యానీ మాట తీసుకున్నాడు. జనవరి 24న కాజీపేట నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్న తాళ్లపల్లి అనిల్‌ను వడ్డేపల్లి చర్చి వద్ద ఆపి మందుకు ఆహ్వానించారు. అనంతరం తమ కారులో ఎక్కించుకుని హసన్‌పర్తి మండలం అనంతసాగర్ కెనాల్ వద్ద చేరుకోన్నారు.
మద్యం సేవించిన తర్వాత తాళ్లపల్లి అనిల్‌పై డ్యాని అతని స్నేహితుడు కలిసి దాడి చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని కెనాల్‌లో పడేశారు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా పూజిత చేత తన భర్త కనబడటం లేదని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. అయితే జనవరి 29న రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అనిల్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో బంధువులు గుర్తించారు. అనిల్ మరణానికి పూజితే కారణమై ఉంటుందని బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు జరిపి పూజితతో పాటు డ్యానీ, అతని స్నేహితుడు అనిల్, డ్యానీ సోదరి కొట్టి సుధామణిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి కారు నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.