భర్త హత్య కేసులో భార్య, ప్రియుడి అరెస్టు

by Shyam |
భర్త హత్య కేసులో భార్య, ప్రియుడి అరెస్టు
X

దిశ, మహబూబాబాద్ :

ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా హత్యచేసిన కేసులో నిందితులిద్దరిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ నరేష్ కుమార్ తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేసముద్రం మండలం తిమ్మంపేట గ్రామంలో మేకల ఉప్పలయ్య, సునీత అనే దంపతులు నివాసముంటున్నారు. సునీత అదే గ్రామానికి చెందిన కాంతా చారితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్నది. అయితే, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే క్రమంలో భర్త ఉప్పలయ్యను అంతమొందించాలని పథకం పన్నింది.

ఈ నెల 9న భర్త వ్యవసాయ భూమి వద్ద ఉండగా, సునీత ప్రియుడితో కలిసి పథకం ప్రకారం ఉప్పలయ్య గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం దగ్గరలో ఉన్న ముడావత్ శీనులు వ్యవసాయ బావి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఉపలయ్యది ఆత్మహత్య కాదని, హత్యగా తేల్చారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య సునీత, ఆమె ప్రియుడు కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story