- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎందుకు? భయమెందుకు?….
X
ప్రతిరోజూ ప్రభాతవేళ
పక్కా ప్రణాళికతో పదిమెట్లు “ఎక్కడం” మేలు
లక్కీగా చిక్కిన వర్క్ ఫ్రం హోం టైంలో
వీలుచూసుకుని సైకిల్ “త్రొక్కడం” మేలు
నాలుగు రోజులు కరోనాకు
చిక్కకుండా ఎక్కడైనా “నక్కడం” మేలు
కరోనాను ఖతం చెయ్యమని
ఆ ముక్కోటి దేవతలకు “మ్రొక్కడం” మేలు
ఎందుకు? భయమెందుకు?
“ఆశే” శ్వాసగా సాగిపో ముందుకు…
ఎందుకు? భయమెందుకు?
“సాహసమే” ఊపిరిగా సాగిపో ముందుకు…
ఎందుకు ? భయమెందుకు?
“దైర్యమే” ఆయుధంగా అడుగులెయ్ ముందుకు…
భయపడితే బ్రతకలేము, భయపడితే మన వెనుకే
వెంటాడే పులులుంటాయి,వేటాడే సింహాలుంటాయి
కరోనాలాంటి తరిమే తోడేళ్ళుంటాయి తస్మాత్ జాగ్రత్త
భయపడే పిరికి పందకు ప్రతిరోజు మరణమే
ధైర్యవంతుడికి బుద్దిశాలికి మరణంమాత్రం ఒక్కసారే
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్ – 9110784502
Email. [email protected]
Address.Attapur. Hyderabad.48
Advertisement
Next Story