- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధనిక రాష్ట్రం అప్పులు ఎందుకు తీసుకుంటుంది…?
దిశ, తెలంగాణ బ్యూరో: ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఎందుకు అప్పులు తీసుకుంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు అప్పులు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఎందుకు ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటున్నారని అన్నారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ కార్యాయలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థపై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. బంగ్లాదేశ్ జీడీపీతో భారత్ జీడీపీని పోల్చడం అవివేకమన్నారు. ఆదిలాబాద్ ఆదాయం, హైదరాబాద్ ఆదాయం ఒకే విధంగా ఉండవన్న అంశాలను గుర్తించాలని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాలని డిమాండ్ చేశారు. గతంలో సహాయ మంత్రిగా పని చేసిన తనకు ఇప్పుడు తనకే ఐదుగురు సహాయ మంత్రులు ఉన్నారని, బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటగా ఆజాద్‌కి అమృత్ వర్ష్ మహోత్సవ్ కార్యక్రమం లోగును ఆవిష్కరించానని పేర్కొన్నారు.
దేశంలో 75 వారాల పాటు దేశ అభివృద్ధిని చాటిచెప్పేలా ఆజాద్‌కి అమృత్ వర్ష్ మహోత్సవ్ కార్యక్రమాన్ని సాంస్కృతిక శాఖ తరుపున చేపట్టామని తెలిపారు. గ్రామ గ్రామాన ప్రతి సర్పంచ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి సంబంధించి ప్రతి పౌరుడి నుంచి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. దేశంలో 3700 ప్రాచీన కట్టడాలుండగా వీటిలో 40 కట్టడాలకు మాత్రమే యునెస్కో, వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా గుర్తింపు వచ్చిందని తెలిపారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు యునెస్కోకి రామప్ప ఎంపిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. టూరిజంను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్శిస్తామని చెప్పారు.
జనవరి 1 నుంచి దేఖో అప్‌నా దేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం టూరిస్టులను ఆహ్వానిస్తుందని చెప్పారు. పీపీఐ మానేరు కింద హెరిటేజ్ కట్టడాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని గోల్కొండ, గండికోటలను తర్వలోనే అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.