- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రధానికి ప్రేమ లేఖ ఎందుకు రాశారు?
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకిస్తూ రైతాంగానికి మద్దతునిచ్చిన సీఎం కేసీఆర్ వెంటనే ప్రధాని మోడీకి ప్రేమ లేఖ ఎందుకు రాశారని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలవడం మంచిదే. కానీ 8వ తేదీన ఎన్డీఏకు వ్యతిరేకంగా గావుకేకల ధ్వని, అది ముగియక ముందే మరుసటి రోజు ప్రధాని మోడీని అభినందిస్తూ ప్రేమ లేఖ రాశారన్నారు. ఆయనను ప్రసన్నం చేసుకోవడం తప్ప మరొకటి కాదన్నారు.
ఢిల్లీకి వెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడి రైతు ఉద్యమ కార్యాచరణ కమిటీని కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. రైతుల పోరాటాన్ని సమర్దిస్తూ ఎన్టీఏను వ్యతిరేకిస్తూ చేసిన పోరాటానికి న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. ఈ ఉత్తరంలో ఉన్న ఆంతర్యమేమిటన్నారు. అంత అత్యవసరమైన సమస్య కాదన్నారు. రాష్ట్ర మంత్రులు మొదలుకొని టీఆర్ఎస్ కింది స్థాయి నాయకుల వరకు 8వ తేదీన భారత్ బంద్ లో పాల్గొన్నారు. వారందరికీ అభినందనలు తెలిపారు. ఎలాగో ఢిల్లీకి వెళ్తున్న సీఎం కేసీఆర్ అక్కడ చలిలో వణుకుతూ ఆందోళన చేస్తోన్న రైతులను కలిసి తన సంపూర్ణ మద్దతును ప్రకటించాలని కోరారు.