అనుపమ అందుకే వెనకబడిందా?

by Shyam |
అనుపమ అందుకే వెనకబడిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: రింగు రింగుల జుట్టు.. పెద్ద కళ్లు… చక్కని నవ్వుతో చూడగానే మతిపోగొట్టేసే అందం అనుపమ పరమేశ్వరన్ సొంతం. కన్నడలో ఫస్ట్ మూవీ ‘ప్రేమమ్‌’తో యూత్‌ను కనెక్ట్ చేసేసింది. తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. ‘అఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’ చిత్రాల్లో కనిపించిన అమ్మడు… మోడ్రన్‌గా, సాంప్రదాయంగా కనిపిస్తూ కుర్రకారు వాల్ పేపర్‌గా ఫిక్స్ అయిపోయింది. దీంతో అనుపమ అతి త్వరలో స్టార్ రేంజ్‌ను చూస్తుందనుకున్నారు అంతా. కానీ అలాంటిదేమీ జరగలేదు. కారణం గ్లామరస్ రోల్స్‌కు నో చెప్పడమేనట. తనను ప్రేక్షకులు మరీ అంత ఓవర్ డోస్‌లో, గ్లామర్ లుక్‌లో కనిపించేందుకు ఇష్టపడరని.. వచ్చిన అవకాశాలను వదులుకుందట. అందుకే టాలెంట్ ఉన్నా.. స్టార్ హీరోయిన్ కాలేకపోయిందని … ఇతరులతో పోలిస్తే రేస్‌లో వెనుకబడి పోయిందనేది ఫిల్మ్ నగర్ టాక్. కానీ తమిళ్, కన్నడ ఇండస్ట్రీల్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న అనుపమ… అక్కడ కూడా సాంప్రదాయంగానే ఉంటుందా? లేక గ్లామరస్ షోకు ఓకే చెప్తుందా చూడాలి.

ప్రస్తుతం తెలుగులో నిర్మాత దిల్ రాజు మేనల్లుడు అశీష్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న సినిమాలో కనిపించబోతోంది అనుపమ. ఏరి కోరి మరి అనుపమను సినిమాకు ఓకే చేసిన దిల్ రాజు… ఇందుకోసం భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చాడట.

Tags: Anupama Parameswaran, Premam, Tollywood

Advertisement

Next Story

Most Viewed