ఎవరిది రియల్ లవ్..లవర్స్ దా… మ్యారీడ్ కపుల్స్ దా !

by Sujitha Rachapalli |   ( Updated:2021-02-14 03:14:51.0  )
ఎవరిది రియల్ లవ్..లవర్స్ దా… మ్యారీడ్ కపుల్స్ దా !
X

దిశ,వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 14 అనగానే వెంటనే స్ట్రైక్ అయ్యేది వాలెంటైన్స్ డే. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమకు, ప్రేమికులకు ఓ విశిష్ట గుర్తింపు నిస్తూ జరుపుకొనే రోజు ఇది. అయితే ప్రేమ అనేది కేవలం లవర్స్‌కు మాత్రమే సొంతమా.. అలాయితే మరి అసలైన ప్రేమకు కేరాఫ్‌‌గా చెప్పే మ్యారీడ్ కపుల్స్ మాటేంటి. ఎన్నో ఏండ్లుగా అన్యోన్య బంధంతో ప్రేమ ప్రయాణం చేస్తున్న వారి సంగంతేంటి. నిజంగా లవ్ అంటే ఎవరిది. మ్యారీడ్ కపుల్స్‌దా లేక లవర్స్ దా..వరల్డ్ మ్యారేజీ డే(ఫిబ్రవరి(14) రెండో ఆదివారం) సందర్బంగా మ్యారీడ్ కపుల్స్ లవ్ పై దిశ ప్రత్యేక కథనం…

లవర్స్..మ్యారిడ్ కపుల్స్..వీరిద్దరూ భిన్న ద్రువాలు. లవర్స్ ప్రయాణం ప్రేమతో మొదలై పెండ్లితో ముగుస్తూ ఉంటుంది. కానీ కపుల్స్ ప్రయాణం పెండ్లితో మొదలై ప్రేమతో నడుస్తూ ఉంటుంది. మొదటి దానిలో వారు కలసి ఉండటానికి ఆటంకాలు అడ్డువస్తాయి. రెండో దానిలో విడిపోవడానికి అనుబంధాలు అడ్డువస్తాయి. అందుకే ప్రేమతో కన్నా పెండ్లితో ముడిపడిన బంధం బలంగా ఉంటుంది.

ఇక లవ్ అనేది లవర్స్ కన్నా దంపతుల మధ్యే ఎటర్నల్‌గా ఉండి పోతుంది. ఎందుకంటే ఏ రిలేషన్ విలువైనా అది సమస్యలను తట్టుకుని ఎంతకాలం నిలుబడుతుందనే అంశంపై ఆధార పడి ఉంటుంది. లవ్‌ను మ్యాథ్స్‌తో పోలిస్తే…అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ప్రేమికుల కన్నా దంపతులే సులభంగా సాల్వ్ చేసుకోగలరు. ఎందుకంటే లవ్ అనే మ్యాథ్స్‌లో ఎలాంటి సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేసేందుకు కపుల్స్ దగ్గర ఓ సూత్రం(మంగళ సూత్రం) ఉంటుంది. ఆ సమస్యను సాల్వ్ చేయడంలో విఫలమైనా..ఆ సూత్రమే సమస్య పరిష్కారానికి మరో అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.

ఇంకా చెప్పాలంటే…కపుల్స్ మధ్య ఉండేది సపోర్టింగ్ లవ్. అలాంటి లవ్‌లోనే ఎక్కువ అండస్టాండింగ్ ఉంటుంది. సపోర్టింగ్ లవ్‌లో భార్యను భర్త, భర్తను భార్య అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాస్తవానికి ఓ వ్యక్తిని మనం సపోర్టు చేసేది వారిపై అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే. అయితే ప్రేమ నిలబడేది కూడా నమ్మకం ఉన్న చోటే కదా. అందుకే ప్రేమికులతో పోలిస్తే దంపతుల లవ్ కొనసాగుతూనే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మ్యారీడ్ కపుల్స్ మీ లవ్ గురించి గొప్పగా చెప్పుకుంటూ వరల్డ్ మ్యారేజీ డేను సెలబ్రెట్ చేసుకొండి.

Advertisement

Next Story

Most Viewed