- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్ఐవీ డ్రగ్స్ ట్రయల్స్ బంద్: డబ్ల్యూహెచ్‌వో
వాషింగ్టన్: కరోనా పేషెంట్ల కోసం నిర్వహిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్, లొపినవిర్/రెటోనవిర్ సంయుక్త హెచ్ఐవీ డ్రగ్ ట్రయల్స్‌ను ఆపేయాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్ణయించింది. ఈ రెండు డ్రగ్‌లు కరోనా పేషెంట్లపై సానుకూల ప్రభావాన్ని చూపడం లేదని, వైరస్ తీవ్రతను తగ్గించడం లేదని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ట్రయల్స్ మధ్యంతర ఫలితాల్లో ఈ విషయం వెల్లడైందని సంస్థ తెలిపింది. స్టాండర్డ్ ఆఫ్ కేర్ డ్రగ్ కన్నాఇవేమీ ప్రభావవంతంగా పనిచేయడం లేదని పేర్కొంది. దీంతో ఈ రెండు డ్రగ్ ట్రయల్స్‌ను నిలిపేసింది. సుమారు ఐదు రకాల డ్రగ్‌లపై సాలిడారిటీ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏది మంచి ఫలితాలనిస్తాయో పోల్చుతూ అనవసరమనిపించిన డ్రగ్‌ను నిలిపేస్తాయి. తాజాగా, ఈ రెండు డ్రగ్‌లను నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ రెండు డ్రగ్‌లతో చికిత్సనందించడానికి చేస్తున్న యత్నాలపైనా ఈ నిర్ణయ ప్రభావం ఉంటుందని వివరించింది.
ఒక్క రోజులో 2.12 లక్షల కేసులు
ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజు వ్యవధిలో రికార్డ్ స్థాయిలో గరిష్ట కేసులు శనివారం రిపోర్ట్ అయినట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,12, 326 కేసులు నమోదయ్యాయని రోజువారీ రిపోర్టులో సంస్థ వెల్లడించింది. ఇందులో సింహభాగం అమెరికా, బ్రెజిల్, ఇండియాల నుంచే నమోదవుతున్నట్లు తెలిపింది. గతంలో జూన్ 28న నమోదైన కేసులు (1,89,077) రికార్డ్‌గా కాగా, మరణాల సంఖ్య స్థిరంగా రోజుకు దాదాపు 5వేలుగా నమోదవుతున్నది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 11 లక్షల మార్కును దాటాయి. ఏడు నెలల్లో ఈ వైరస్ దాదాపు ఐదు లక్షల మందిని పొట్టనబెట్టుకుంది.