సాధారణ పరిస్థితులు ఇప్పట్లో కష్టమే : డబ్ల్యుహెచ్ఓ

by Shyam |   ( Updated:2020-07-14 06:57:27.0  )
సాధారణ పరిస్థితులు ఇప్పట్లో కష్టమే : డబ్ల్యుహెచ్ఓ
X

జెనీవా: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున, ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మరింతగా దిగజారిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో సాధారణ పరిస్థితులు ఏర్పడడం కష్టమేనని స్పష్టం చేసింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోకుంటే గత సాధారణ పరిస్థితులు అసాధ్యమేనని డబ్ల్యుహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ అన్నారు. చాలా దేశాలు కరోనా కట్టడిలో తప్పుడు దిశలో వెళ్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి ప్రజల పాలిట శత్రువుగా పరిణమించిందని చెప్పారు. ఇకనైనా కరోనా మహమ్మారి నివారణకు సరైన చర్యలు తీసుకోకుంటే ఈ వైరస్ మరింత కోరలు చాస్తుందని హెచ్చరించారు. కాగా, వరల్డ్ వైడ్‌గా కరోనా కేసులు ఐదు రోజుల్లోనే 10 లక్షలు నమోదయ్యాయి. ఇప్పటివరకు సుమారు 5 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed