- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌన్ బనేగా ‘కమల’ దళపతి !
దిశ, ఆదిలాబాద్: జిల్లా బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిని రేపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు, 20 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలోనే జిల్లాల విభజన టైం నుంచి ఇప్పటివరకు నిర్మల్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న పడకంటి రమాదేవికి మరోసారి అవకాశం ఇస్తారా లేకుంటే కొత్తవారిని ఎంపిక చేస్తారా అన్నది పార్టీ శ్రేణుల్లో సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా కొత్త లీడర్ నియామకంపై సర్వేలు చేయించినట్లు తెలుస్తుండటంతో ఎవరివైపు మొగ్గుచూపి ఎవరికి కుర్చీ అప్పగిస్తారన్నది తెలియాల్సి ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉండటంతోపాటు రాష్ట్రంలో బలపడుతున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా పెరిగింది. ప్రస్తుత అధ్యక్షురాలు రమాదేవి మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తుండగా.. ఒకవేళ ఆమె అంగీకరిస్తే జిల్లా అధ్యక్ష బాధ్యతను మళ్లీ అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రమాదేవి నిర్ణయం ఇంకా ఏటూ తెలియకపోవడంతో జిల్లా పార్టీ బాధ్యతలు ఎవరు లీడ్ చేస్తారన్నది కీలకంగా మారింది. ఇప్పటికే జిల్లానేతలతో పలు దఫాలుగా సమావేశమైన హైకమాండ్ అభిప్రాయ సేకరణ చేపట్టిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్ నేత అయ్యన్నగారి భూమయ్య, రావుల రామ్‌నాథ్‌లు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
గ్రామస్థాయిలో పట్టు ఉండటంతోపాటు అధిష్ఠానం అప్పగించే టాస్క్‌ను అమలు చేస్తారని పేరున్న దిలావర్పూర్‌కు చెందిన సామ రాజేశ్వర్‌రెడ్డి, నిర్మల్‌కు చెందిన ఒడిశెల శ్రీనివాస్ పేర్లు కూడా జిల్లా బీజేపీ అధ్యక్ష రేసులో వినిపిస్తున్నాయి. భైంసాకు చెందిన రవి పాండే, బాసరకు చెందిన సీనియర్ నేత సతీశ్వరరావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరితోపాటు ఇటీవల కాలంలో పార్టీలో కీ రోల్ పోషిస్తూ, ప్రభుత్వంపై వివిధ రూపాల్లో నిరసన గళాన్ని వినిపిస్తూ తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ న్యాయవాది, నిర్మల్‌కు చెందిన కె. అంజిరెడ్డి పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. ఈక్రమంలో పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపి ఎవరికి బాధ్యతలను అప్పగిస్తారన్నది కీలకంగా మారింది.