డెల్టా వేరియంట్‌పై WHO కీలక ప్రకటన

by vinod kumar |   ( Updated:2021-06-24 20:19:54.0  )
డెల్టా వేరియంట్‌పై WHO కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: డెల్టా వేరియంట్‌ కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ 85 దేశాలకు ప్రబలిందని తెలిపింది. గత రెండువారాల్లో 11 దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు స్పష్టం చేసింది. ఇదే కొనసాగితే ఈ వేరియంట్ భౌగోళిక ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరించింది. డెల్టా వేరియంట్ కన్నా ముందు వచ్చిన ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లు కూడా ఆందోళనకర వేరియంట్లుగా WHO పేర్కొంది.

ప్రస్తుతం ఆల్ఫా వేరియంట్ 170 దేశాల్లో, బీటా వేరియంట్ 119 దేశాల్లో, గామా వేరియంట్ 71 దేశాల్లో వ్యాపించి ఉన్నాయని పేర్కొంది. ఆల్ఫా వేరియంట్ కంటే డెల్టా వేరియంట్ 1.23 రెట్లు వేగంగా ప్రబలుతున్నట్లు తెలిపింది. డెల్టా వేరియంట్ బాధితుల్లో మరణాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

Advertisement

Next Story