- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘వివి’ఐపీ ప్లాన్ అదేనా!
ఇటీవల జనసేన పార్టీకి రిజైన్ చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అడుగులు మళ్లీ ఎటువైపు పడుతాయన్న చర్చ రాజకీయాల్లో తీవ్రంగా జరుగుతోంది. పవన్ విధానాలు, మేనిఫెస్టో నచ్చే పార్టీలో చేరానని చెప్పుకున్న లక్ష్మీనారాయణ.. 2019 ఎలక్షన్స్ ముగిశాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం కల్పించకుండా తన ఆలోచన విధానాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అసంతృప్తికి గురైన ఈ మాజీ జేడీ.. పవన్‌కు గుడ్‌బై చెప్పి ఇటీవల తన దారి తాను చూసుకున్నారు. అయితే రాజకీయాల కోసం ఉద్యోగానికి రాజీమానా చేసి వచ్చిన ఆయన జనసేనలో ఇమడలేక బయటకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఎటువైపు అడుగులు వేస్తారన్నది కీలకంగా మారింది.
2019 ఎలక్షన్స్‌కు దాదాపు ఆర్నెళ్ల ముందు ఉద్యోగానికి స్వస్తి పలికిన లక్ష్మీనారాయణ ఆర్నెళ్లపాటు రాష్ట్రంలో రైతుల సమస్యలను తెలుసుని రాజకీయ అడుగులు వేసేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఆ క్రమంలోనే లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతారని వార్తలు వచ్చినా ఖండిస్తూ వచ్చారు. ఏ పార్టీలో చేరడంలేదని, సొంతంగానే పార్టీ పెట్టబోతున్నాడని రాష్ట్రంలో ప్రచారం జరిగింది. అంతలోనే ఒక్కసారిగా జనసేనలో చేరి ప్రజలందరికీ స్వీట్ షాకిచ్చాడు. ఈ పరిణామాల్లో భాగంగానే పవన్ కల్యాణ్‌తో పొసగక.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు నిలకడగా ఉండట్లేవని బయటకొచ్చి ప్రెస్‌మీట్‌లో సైతం చెప్పి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.
లక్ష్మీనారాయణ బయటికి వచ్చినప్పటి నుంచి తెలుగు రాజకీయాల్లో రోజుకోమాట వినపడుతూ వస్తోంది. గతంలో జగన్ ఆస్తుల కేసు విచారణ చేసినందున ఆ పార్టీలోకి వెళ్లే పరిస్థితులు ఉండవని, వెళ్లినా వైసీపీ రాజకీయాలను ఆయన తట్టుకోలేడని అనుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబు ఆహ్వానించినా టీడీపీలో సెటిల్ కాలేడని, చేరితే బీజేపీలో చేరడం, లేకుంటే సొంతంగా ఏదైనా కార్యాచరణ పెట్టుకొని ముందుకు పోవడమో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మీనారాయణ రాజకీయ వ్యూహంపై నేతల్లో కొత్త చర్చ మొదలైంది.
ప్రస్తుతం లక్ష్మీనారాయణకు ఉన్న ఆలోచనలను ఏ పార్టీలో చేరి చెప్పినా పట్టించుకునే అవకాశాలు తక్కువని, ఈ నేపథ్యంలో మళ్లీ విభేదాలు వస్తే పార్టీ నుంచి బయటకు రావల్సిన పరిస్థితులే ఉంటాయని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అందుకే లక్ష్మీనారాయణ సొంత పార్టీ పెట్టుకునేందుకే ప్లాన్ రెడీ చేస్తున్నారని, తాను అనుకున్న విధానాలు, తన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేపట్టబోయే ప్రణాళికను తయారు చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువత, రైతులను తమవైపు తిప్పుకునేందుకు పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తూ సొంతపార్టీ ఏర్పాటుకే రంగం సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినపడుతున్న మాట.