- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెంచిన డైట్ చార్జీలకు అణుగుణంగా భోజనం పెట్టాలి
by Sridhar Babu |
X
దిశ, ఆసిఫాబాద్ : ప్రభుత్వ పెంచిన డైట్ చార్జీలకు అణుగుణంగా మధ్యాహ్నం భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం రెబ్బెన మండలం నంబాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.
ప్రభుత్వం పెంచిన నూతన డైట్ చార్జీలకు అనుగుణంగా మధ్యాహ్నం భోజనం అందించాలని, పదోతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయ సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం నంబల గ్రామంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులతో కలిసి భూమిని పరిశీలించారు.
Advertisement
Next Story