రణ్‌వీర్ కండోమ్ యాడ్‌పై తండ్రి రియాక్షన్!

by Shyam |
Ranveer-Singh
X

దిశ, సినిమా : స్టైల్‌కు ఐకాన్‌లా నిలిచే బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, తన ఫస్ట్ కమర్షియల్ యాడ్‌పై ఫాదర్ జగ్జీత్ సింగ్ భవాని రియాక్షన్ ఏంటో వెల్లడించాడు. అంతేకాదు తోటి హీరోలందరూ ఎండార్స్‌మెంట్స్ ద్వారా డబ్బు సంపాదిస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావని? అడిగేవారని గుర్తుచేసుకున్నాడు. అసలు విషయానికొస్తే.. 2014లో ఓ లీడింగ్ కండోమ్ బ్రాండ్‌ రణ్‌వీర్‌తో ఒప్పందం కుదుర్చుకోగా.. 2019 వరకు ఆ కంపెనీకి తనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు.

అయితే ఈ యాడ్‌కు సైన్ చేసిన తర్వాత.. తను మొదటిసారిగా ఓ ప్రకటనలో కనిపించబోతున్నానని తండ్రికి ఇన్‌ఫార్మ్ చేశాడట. ఇందుకు సంతోషించిన జగ్జీత్.. బ్రాండ్ పేరేంటని? ఆసక్తిగా అడిగితే ‘కండోమ్’ అని చెప్పానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రణ్‌వీర్. ఇక ఆ పేరు వినగానే తండ్రి జగ్జీత్.. ‘రియల్లీ? నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసనే అనుకుంటున్నా’ అంటూ రిప్లయ్ ఇచ్చాడని పేర్కొన్నాడు.

కాగా ఫోర్బ్స్ ఇండియా రిపోర్టు ప్రకారం.. కొన్నేళ్ల తర్వాత సదరు కంపెనీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారని.. రణ్‌వీర్ అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు అతడి మ్యారీడ్ స్టేటస్ అందుకు కారణమని తెలిసింది. ప్రస్తుతం రణ్‌వీర్ నటించిన కపిల్ దేవ్ బయోపిక్‌ మూవీ ‘83’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed