స్విమ్మింగ్ వచ్చు కానీ, బికినీ వేసుకోను.. నిర్మొహమాటంగా చెప్పిన హీరోయిన్

by Shyam |   ( Updated:2021-10-01 06:26:41.0  )
Krithi Sanon
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ బీటౌన్ ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లు. ఇప్పటికే గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భామ.. లాస్ట్ పిక్చర్ ‘మిమి’లో సరోగేట్ మదర్‌గా కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో తన ఆడిషన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఫేస్‌లో స్మైల్ మిస్ కాకుండా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. క్లిపింగ్‌లో తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్న కృతి.. 5 ఫీట్ 9 ఇంచెస్ ఎత్తు ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత సైడ్ అండ్ ఫ్రంట్ ప్రొఫైల్స్ కాన్ఫిడెంట్‌గా చూపించిన నటి… ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానమిచ్చింది. స్విమ్మింగ్ వచ్చా? అని క్వశ్చన్ చేయగా.. ‘ఎస్’ అని చెబుతూనే టూ పీస్ డ్రెస్(బికినీ)లో మాత్రం కంఫర్ట్‌గా ఉండలేనని కన్‌ఫర్మ్‌గా చెప్పేసింది. ఇక ఓ ప్రమాదంలో ఉన్న వ్యక్తి ఇతరులను హెల్ప్ చేయమని ఎలా అడుగుతుంది? అనే సీన్‌ను ఆడిషన్‌లో చేసి చూపించింది.

Advertisement

Next Story