'అంత చిన్న కుర్రాడిలో ఏం టాలెంట్ ఉంటుందిలే అనుకున్నా'

by Shyam |   ( Updated:2020-06-12 08:33:37.0  )
అంత చిన్న కుర్రాడిలో ఏం టాలెంట్ ఉంటుందిలే అనుకున్నా
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సచిన్ రిటైర్ అయిన తర్వాత అతని గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా క్రికెట్ ఆట నిలిచిపోవడంతో చాలా మంది గత స్మృతులను నెమరువేసుకుంటున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఫేస్‌బుక్‌లైవ్‌లో సచిన్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ‘నేను టీం ఇండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడు న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం ముంబై వెళ్లాం. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోచ్ వాసుదేవ్ పరాంజే ఒక 15 ఏండ్ల కుర్రాడిని తీసుకొని వచ్చారు. ఈ కుర్రాడికి బౌలింగ్ చేసి చూడండి.. అద్భుతమైన టాలెంట్ ఉందని చెప్పాడు. కానీ నేను అంత చిన్న కుర్రాడిలో ఏం టాలెంట్ ఉంటుందిలే అనుకున్నా. పరాంజే పట్టుబట్టి మరీ ఆ కుర్రాడిని తన ముందకు తీసుకొచ్చి బౌలింగ్ చేయమని కోరాడు. ఆ పిల్లాడికి గాయాలయితే బాధ్యత ఎవరిది అని అడిగినట్లు’ సర్కార్ చెప్పాడు. టీంలో ఉన్న కపిల్, అర్షద్, మనిందర్, చేతన్ శర్మ తదితరులను పిలిచి బౌలింగ్ చేయమంటే తొలుత నిరాకరించారు. నేను పట్టుబట్టిన తర్వాత కాసేపే బౌలింగ్ చేస్తామని చెప్పారు. సచిన్‌ వాళ్ల బౌలింగ్‌ను నెట్స్‌లో ధీటుగా ఎదుర్కున్నాడు. తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడని చెప్పాడు. ఆ తర్వాత ముంబై జట్టులో కూడా తాను సూచించన తర్వాతే సచిన్‌ను ఎంపిక చేశారు. ఏడాది తిరిగేసరికి సచిన్ నాతో కలసి పాకిస్తాన్ టూర్‌కి రావడం.. ఆ తర్వాత అతనో దిగ్గజ క్రికెటర్‌గా ఎదగడం అందరికీ తెలిసిందే అని సర్కార్ చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed