స్టిరేన్ గ్యాస్ పీలిస్తే ఏమవుతుంది?

by Shyam |
స్టిరేన్ గ్యాస్ పీలిస్తే ఏమవుతుంది?
X

హైడ్రోకార్బన్ విభాగానికి చెందిన స్టిరేన్‌ను రసాయనిక పరిభాషలో సీ8హెచ్8గా పిలుస్తారు. వినైల్ బెంజీన్, ఇథనైల్ బెంజీన్, ఫినైల్ ఇథిలీన్ రసాయనాల సమ్మేళనంతో తయారైన స్టిరేన్ ద్రవరూపంలో ఉండి ఆవిరై వాయువుగా మారినప్పుడు ఎలాంటి రంగు ఉండదు. తియ్యటి వాసనతో ఉండే ఈ వాయువు గాలిలో కలిసిన తర్వాత విషమయమవుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ కంటే మూడు రెట్ల బరువుండే దీన్ని శ్వాసగా మనం పీల్చినప్పుడు మన దేహానికి అవసరమై ఆక్సిజన్ అందకపోవడంతో స్పృహ తప్పి పడిపోతాం. మనుషులకే కాక పశువులకూ ఊపిరాడక ఇబ్బంది తలెత్తుతుంది. నీటిలో పెద్దగా కరగదుగానీ దీనికి యాంటీ డోట్‌గా ఇథనాల్, ఎసిటోన్, ఆల్కహాల్‌ను స్ప్రే చేయాల్సి ఉంటుంది. గుజరాత్ నుంచి తెప్పించిన బ్యుటైల్ ఆల్కహాల్‌‌ను కూడా యాంటీ డోట్‌గా వినియోగించారు.

స్టిరేన్ వాయువును పీలిస్తే శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. ఊపిరితిత్తులు పనిచేయక చనిపోతారు. కొంత మోతాదులో ఊపిరితిత్తుల్లోకి వెళ్తే అవి దెబ్బతింటాయి. కళ్ళల్లోకి వెళ్తే రంగులను గుర్తుపట్టే స్వభావాన్ని కోల్పోతాం. తలనొప్పి వస్తుంది. వాంతులు, వికారం వస్తుంది. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాం. నాడీ వ్యవస్థపైన తీవ్ర ప్రభావం చూపడంతో ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతాం. గర్భిణులైతే కడుపులోని బిడ్డపైన కూడా ప్రభావం పడుతుంది. ఈ వాయువు కారణంగా ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థ, లివర్ దెబ్బతింటాయి.

వైద్యులు సూచించే ట్రీట్‌మెంట్ :

ఇలాంటి వాయువును పీల్చిన తర్వాత ఆస్పత్రికి వచ్చినవారికి వెంటనే ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది. కళ్ళను నీటి ధారతో శుభ్రం చేయాలి. లేదా సెలైన్ వాటర్ (డెక్స్‌ట్రోజ్)తో శుభ్రం చేయాలి. వాంతుల్ని నివారించేందుకు మాత్రలతో పాటు సాల్‌బ్యుటమాల్, ఆల్‌బ్యుటెరాల్, లివల్‌బ్యుటెరాల్ లాంటి మాత్రలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆస్పత్రుల్లో చికిత్స కోసం తగినంత సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, రెస్క్యూసిటేటర్లు లాంటివి సమకూర్చుకోవాలి.

Tags: Styrene gas, Symptoms, Antidote, treatment

Advertisement

Next Story