Corona : కరోనా వస్తే ఏం చేయాలి? ఏం చేయకూడదు?

by sudharani |   ( Updated:2021-05-24 05:52:15.0  )
House Isolation
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ అందరికి చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. పూర్తిగా ఆరోగ్యవంతులను కూడా ఈ వైరస్ బలహీనులను చేస్తోంది. ఇంటిళ్లుపాదిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు అన్ని కుటుంబాలను ఈ మహమ్మారి వెంటాడుతోంది. అయితే కుటుంబంలో ఎవరైన కరోనా బారిన పడితే ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం.!

ఇంట్లో సభ్యులకు కరోనా సోకితే వెంటనే ఆస్పత్రిలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు లేకపోవడం.. ప్రైవేట్ హాస్పటల్లో దోపిడీని భరించలేక 90 శాతం మంది హౌస్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. అయితే కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వారు పూర్తిగా హౌస్ ఐసోలేషన్‌లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు. కానీ మన ఇంట్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. మీ భాగస్వామి లేదా మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా కరోనా బారిన పడినప్పుడు వారికంటూ ప్రత్యేక గదిని కేటాయించలేని పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ మీరు ఆరోగ్యంగా ఉంటూనే వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించవచ్చు అంటున్నారు వైద్యులు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి

ఇంటి సభ్యుడికి కరోనా సోకితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ తొలగించకూడదు. కరోనా బారిన పడిన వారి దుస్తులను విడిగా ఉతకాలి. క్రిమిసంహారక మందులతో వారి దుస్తులను శుభ్రం చేయాలి. రెండు వాష్‌రూంలు లేని సందర్భాల్లో కామన్ టాయ్‌లెట్‌ను తరచూ బ్లీచింగ్ పౌడర్ లేదా పినాయిల్ వేసి శుభ్రం చేయాలి. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులు పడేసిన వస్తువులను ప్రత్యేకంగా బాక్సు ఏర్పాటు చేసి అందులో వేయాలి.చేతులను తరచూ శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి

ఈ పనులు అసులు చేయకూడదు

వైరస్ బారిన పడిన వారి వస్తువులను తాకరాదు. కరోనా బారిన పడిన వ్యక్తి గదిలోకి ఇతర కుటుంబ సభ్యులు వెళ్లరాదు. ఒకవేళ వెళ్తే వారి నుంచి మీకు వైరస్ సోకే ప్రమాదముంది. వైరస్‌తో బాధపడుతున్న వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులు బయట వ్యక్తులతో కాంటాక్ట్ అవ్వకూడదు. ఒకవేళ కాంటాక్ట్ అయితే వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. సాధ్యమైనంత వరకు వారి వస్తువులను వారే శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేయాలి. ఆందోళన కలిగించే విషయాలు, వార్తలు కరోనా బాధితులకు తెలియకుండా ఉంచాలి.

Advertisement

Next Story

Most Viewed