- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘టాక్’ ఆఫ్ యాప్స్.. దూసుకుపోతున్న ఆడియో చాటింగ్ సర్వీస్
దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త యాప్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. బాగుంటే ట్రెండింగ్‌లో నిలిచి నెటిజన్ల ఆదరణ అందుకుంటాయి. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా యాప్‌లో మార్పులు రాకపోతే.. అప్పటివరకు అగ్రస్థానంలో ఉన్నవి కూడా కనుమరుగైన సందర్భాలున్నాయి. అంతేకాదు కొత్త యాప్స్ హవా తట్టుకోలేక పోటీలో వెనుకబడ్డ యాప్స్ కూడా బోలెడు. ఈ క్రమంలోనే ‘క్లబ్‌హౌస్’ అనే న్యూ యాప్ కొద్ది నెలల్లోనే ఐవోఎస్(iOS) వినియోగదారుల్లో సంచలనం సృష్టించడంతో పాటు అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టా, జూమ్, వాట్సాప్, టిక్‌టాక్‌లను వెనక్కి నెడుతూ టాప్ యాప్‌గా కొనసాగేందుకు ప్రయత్నిస్తోంది. టెక్నాలజీ టైటాన్స్, బిజినెస్ టైకూన్స్, సెలెబ్రిటీ ఐకాన్స్, రాజకీయ ప్రముఖులు ఈ యాప్‌ను ఫాలో కావడం మొదలుపెట్టారు. ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ కూడా ఇటీవలే ‘క్లబ్ హౌస్’ ఉపయోగించడం స్టార్ట్ చేశాడు. యూఎస్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటున్న ఈ ‘క్లబ్ హౌస్ యాప్’ ప్రత్యేకతలు ఏంటి? అందులోకి ఎలా ఇన్వైట్ చేయాలి? ఇండియన్ యూజర్లకు క్లబ్ హౌస్ ఉందా?
సోషల్ నెట్‌వర్కింగ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తున్న ‘క్లబ్‌హౌస్’ కూడా పాడ్‌కాస్ట్ లాంటిదే. కానీ ఇందులో లైవ్ ఆడియోలు వినొచ్చు. ఆడియో చాటింగ్ సర్వీస్ అందించే ఈ యాప్‌లో వివిధ అంశాలపై ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్, ప్రముఖులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులెవరైనా అందించే సంభాషణలు, ఇంటర్వ్యూలు, చర్చలను యూజర్లు వినొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కాన్ఫరెన్స్ కాల్ లాంటిది. డిస్కషన్స్, సెషన్స్‌లో పాల్గొన్నవాళ్లు మాట్లాడుతుంటే.. ఆయా టాపిక్స్‌పై ఆసక్తి ఉన్న వినియోగదారులు వాటిని వింటుంటారు. ఈ ఆడియో-చాట్ సెషన్‌లు వివిధ టాపిక్స్‌పై (ఉదా : టాక్ షోస్, సంగీతం, నెట్‌వర్కింగ్, డేటింగ్, పర్‌ఫార్మెన్స్, రాజకీయ చర్చలు) ఉంటుండగా, యూజర్ తనకు నచ్చిన అంశాల ఆధారంగా ఆయా టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని ఫాలో కావచ్చు. కస్టమర్ ఆసక్తి కనబరిచిన అంశాల ఆధారంగా లైవ్‌లో జరుగుతున్న డిస్కషన్స్‌తో పాటు అప్‌కమింగ్ మీటింగ్స్, సెషన్స్ వివరాలను క్లబ్‌హౌస్ నోటిఫికేషన్ అందిస్తుంది లేదా డిస్‌ప్లేలో చూపిస్తుంది. ఉదాహరణకు యూజర్ అంతరిక్ష శాస్త్రాన్ని(స్పేస్ సైన్స్) ఎంచుకుంటే.. సజెషన్స్‌లో ఎలన్ మస్క్ క్లబ్‌హౌస్ సెషన్స్ చూపిస్తుంది. ఈ ఆడియో-చాట్ సెషన్స్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉంటాయి. ఇంట్లో కూర్చునే అమెరికా, రష్యా, యూరప్, జపాన్‌కు చెందిన సెలబ్రిటీల సెషన్స్‌తో పాటు మోదీ, సచిన్, చిరంజీవి డిస్కషన్స్ వినవచ్చు. లైవ్ స్ట్రీమ్ సెషన్స్ సేవ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
ఇన్విటేషన్ ఉంటేనే?
క్లబ్‌హౌస్ ఉపయోగించాలంటే.. అందులో ఇప్పటికే ఉన్న వినియోగదారుల నుంచి ఆన్‌బోర్డ్‌లోకి అనుమతించే లింక్ రూపంలో ఇన్విటేషన్ పంపాలి. ఇన్విటేషన్ రాకపోతే.. దీన్ని ఉపయోగించలేం. ప్రస్తుతానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. ఈ లింక్ ఎస్ఎమ్‌ఎస్ ద్వారా వస్తుంది. గుర్తుంచుకోండి.. ఇప్పటికే ఉన్న క్లబ్‌హౌస్ వినియోగదారుకు కేవలం రెండు ఆహ్వానాలు సెండ్ చేయడానికి మాత్రమే వీలుంటుంది. అయితే ‘క్లబ్‌హౌస్‌ను’ విస్తృతంగా విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నప్పటికీ, యాప్ ఇప్పటికీ బీటా దశలోనే ఉంది. ఈ సంవత్సరంలోనే బీటా దశను దాటుకుని త్వరలోనే ‘మొత్తం ప్రపంచానికి’ అందుబాటులోకి వస్తుందని క్లబ్‌హౌస్ ఇటీవలే ప్రకటించింది.
పాపులారిటీ?
గతేడాది మార్చిలో ఆల్ఫా ఎక్స్‌ఫ్లోరేషన్ వ్యవస్థాపకులు పాల్ డేవిసన్, రోహన్ సేథ్‌లు కలిసి ఈ ‘క్లబ్‌హౌస్’ను ప్రారంభించారు. మొదట 1,500 మంది వినియోగదారులు మాత్రమే ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ఆ సంఖ్య 2 మిలియన్లకు చేరింది. ఇక ప్రతీ వ్యక్తికి రెండే ఇన్విటేషన్స్ ఉండటంతో చాలామంది వినియోగదారులు తమ ఇన్విటేషన్స్‌ను క్రెయిగ్స్‌లిస్ట్, ఈబే, రెడ్‌డిట్లలో అధిక ధరలకు అమ్మకానికి పెట్టారు. ఇటీవలే టెస్లా సీఈవో ఎలన్ మస్క్, వ్లాడ్ టెనెవ్ సీఈవో రాబిన్‌హుడ్‌తో కలిసి చేసిన చాటింగ్ సెషన్ దీన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు దోహదపడింది. దీంతో ఈ యాప్ తక్కువ సమయంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలోనే ‘ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించడంతో పాటు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటానికి అనుమతించింది’ అని ‘ది క్వార్ట్జ్’ తన నివేదికలో పేర్కొంది. ఈ యాప్ చైనాలో ఎక్కువ మందిని ఆకర్షించడంతో.. సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోనూ ఇన్విటేషన్స్ అందుబాటులో ఉంచడం విశేషం. హాంకాంగ్‌లో నిరసనలు, తైవాన్ రాజకీయ స్థితి సహా పలు రాజకీయ అంశాలను చర్చించేందుకు క్లబ్‌హౌస్ వేదికగా మారింది. దాంతో చైనా ప్రభుత్వం ఫిబ్రవరి 8న క్లబ్‌హౌస్‌ను బ్లాక్ చేయడం గమనార్హం. అయినప్పటికీ ఈ సంవత్సరం 30కి పైగా దేశాల్లో యాపిల్ యాప్ స్టోర్‌లో క్లబ్‌హౌస్ నంబర్ 1 స్థానానికి చేరుకుంది.
ఇండియాలో..
ఇండియాలోని ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లోనూ క్లబ్‌హౌస్ అందుబాటులో ఉంది. అయితే ఇన్విటేషన్ ఉంటేనే ‘క్లబ్ హౌస్’ యాప్‌కు సైన్‌అప్ కాగలిగి, సేవలను వినియోగించుకోగలుగుతాం. ఇక ఇది చైనాకు చెందిన సంస్థ కాకపోవడంతో బ్యాన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక్కడ కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో గత నెలలో 8,000 మంది ఇండియన్స్ క్లబ్ హౌస్‌ను డౌన్‌లోడ్ చేయగా, సెన్సార్ టవర్ ప్రకారం మొత్తంగా 12,000 డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి.
కాగా మే 2020లో దాదాపు 100 మిలియన్ డాలర్లున్న ఈ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ విలువ.. 21 జనవరి, 2021 నాటికి వన్ బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతానికి ఐవోఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్.. త్వరలోనే ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌లో తప్పకుండా యాప్ లాంచ్ అవుతుందని, కానీ పని ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదని మీడియా నివేదికలు చెబుతున్నాయి.