- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యమకారులకు మీరేం చేశారు కేసీఆర్.. : చెరుకు సుధాకర్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమంలో పునాది రాళ్ల పాత్రను పోషించిన కార్యకర్తలకు ప్రభుత్వం ఏం చేసిందో స్పష్టంగా చెప్పాలంటూ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్‌చేశారు. మంగళవారం ఆయన తన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు, అమరవీరులకు సరైన గుర్తింపు లభించడం లేదన్నారు. టీఆర్ఎస్పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం హైటెక్స్‌లో నిర్వహించిన ప్లీనరీలో తొలి నాటి లీడర్లకు ప్రాధాన్యతను ఇవ్వకపోవడం బాధకరమన్నారు. అంతేగాక అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారన్నారు. ప్రతీ పథకంపై సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారన్నారు.
ప్లీనరీ కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే పెట్టినట్టు తెలిపారు. ఈ ప్రభుత్వం హయంలో అన్నీ నియంతృత్వమేనన్నారు. కోట్ల మందికి జీవనదారమైన వరికి ఉరిశిక్ష వేస్తూ సిద్దిపేట కలెక్టర్ జైళ్లకు పంపుతామని, కిలో వరి ధాన్యం దొరికినా సస్పెండ్చేస్తామని అధికారులను బెదిరించడం వెనక అంతర్యామేమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌పాలనలో దోపిడీ దారులకు లాభం చేకూరుతుందన్నారు.