వాళ్లిద్దరి భవిష్యత్ ఏంటో?

by Anukaran |   ( Updated:2020-08-08 12:19:52.0  )
వాళ్లిద్దరి భవిష్యత్ ఏంటో?
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ చరిత్రలో ఎం.ఎస్ ధోనీ (dhoni), మిథాలీ రాజ్‌ (mithaali raj) లకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పురుషుల క్రికెట్‌లో మూడు ఐసీసీ (icc) టైటిల్స్ నెగ్గిన కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ అయితే.. మహిళా క్రికెట్ రూపురేఖలనే మార్చిన వ్యక్తిగా మిథాలీ పేరు నిలిచిపోతుంది. క్రికెట్ (cricket) కెరీర్ చరమాంకంలో ఉన్న వీరిద్దరు ఘనంగా ఆటకు వీడ్కోలు పలుకుదామని భావించారు. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌లో ఆడి ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక మిథాలీ అయితే తాను ప్రపంచకప్‌ (world cup)ను ముద్దాడిన తర్వాతే ఆట నుంచి నిష్క్రమిస్తానని మీడియా(media)కు చెప్పింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పురుషుల టీ20 (T20) వరల్డ్ కప్, మహిళల (womens Odi world cup) వన్డే వరల్డ్ కప్ వాయిదా పడటంతో వీరిద్దరి భవిష్యత్ ఏంటో అనే చర్చ మొదలైంది. ఒకవైపు వయసు (Age) మీద పడుతుండటంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా చాన్నాళ్ల నుంచి దూరమైన వీళ్లు మరో ఏడాదికి పైగా వేచి చూస్తారా? లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

నోరు మెదపని ధోనీ..

గతేడాది జూన్‌ (june)లో జరిగిన క్రికెట్ వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్ (inter national) ఆడలేదు. కొన్ని నెలలుగా ధోనీ రిటైర్మెంట్ (retirement) గురించి వార్తలు వచ్చినా అతను మాత్రం నోరు విప్పలేదు. ఐపీఎల్‌ (Ipl)లో ఆడిన తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో స్థానం సంసాదించాలని భావిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కరోనా లాక్‌డౌన్‌ (lockdown)కు ముందు చెన్నై వెళ్లి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే అనూహ్యంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కావడంతో తిరిగి రాంచీ వెళ్లాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కూడా వచ్చే ఏడాది వరకు వాయిదా పడటంతో అందరి దృష్టి ధోనీపై పడింది. ఐపీఎల్ నిర్వహణలో సందిగ్ధం, టీ20 వరల్డ్ కప్ వాయిదాతో ధోనీ ఇక మైదానంలోకి అడుగు పెట్టడం కష్టమేనని భావించారు. అయితే, యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన తర్వాత తొలుత ప్రాక్టీస్ మొదలు పెట్టింది ధోనీనే. దీంతో ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. అంతేకాకుండా ధోనీ వచ్చే ఏడాది ప్రపంచ కప్ కూడా ఆడే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే టీ20 వరల్డ్ కప్ ఇండియా (India)లో జరుగుతుండటం ఒక కారణం కాగా, ఆలోగా రెండు ఐపీఎల్ సీజన్లు జరుగుతుండటంతో వీలైనంత ప్రాక్టీస్ కూడా లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాయిదా పడినా..

భారత మహిళా క్రికెట్‌కు మూలస్తంభం వంటి లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ అవుతున్నట్లు గతంలోనే ప్రకటించింది. అయితే, 2021లో న్యూజిలాండ్‌ (Newze land)లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ అనంతరం తాను ఆట నుంచి నిష్క్రమిస్తానని చెప్పింది. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్ల నుంచి తప్పుకుంది. సుదీర్ఘ క్రికెట్ ఆడినా, ఇప్పటి వరకు తన ఖాతాలో ఐసీసీ టైటిల్ (Icc title) లేదని, ప్రపంచ కప్‌ను ముద్దాడిన తర్వాతే రిటైర్ అవుతానని మీడియాకు చెప్పింది. ఇప్పుడు ఈ మెగా ఈవెంట్ ఏడాది పాటు వాయిదా పడటంతో మిథాలీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. వయసు మీదపడుతుండటం, అంతర్జాతీయ క్రికెట్‌ (Inter national) ఆడి చాలా సమయం కావడంతో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ధోనీకి అయినా ఐపీఎల్ రూపంలో అంతర్జాతీయ స్థాయి ప్రాక్టీస్ లభిస్తున్నది. కానీ మిథాలీకి ఆ అవకాశం లేకపోవడం పెద్ద మైనస్. కాగా, దీనిపై మిథాలీ స్పందించింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ వాయిదా పడినా తన ప్రణాళికలు, లక్ష్యం మారదని స్పష్టం చేసింది. ఇది తనకు మరింత ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుందని అంటున్నది.

Advertisement

Next Story

Most Viewed