- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dharmapuri Arvind: కేటీఆర్‌ను అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి: ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మూసీ (Musi) ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తోందని.. అదే పాతబస్తీ (Old City)కి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఒక్క బిల్డింగ్‌ను అయినా కూల్చే దమ్ముందా అని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind)సవాల్ విసిరారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. యోగీ అదిత్యనాథ్ (Yogi Adityanath) బుల్డోజర్‌కు.. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) బుల్డోజర్‌కు చాలా తేడా ఉందని అన్నారు. కావాలనే హైదరాబాద్ (Hyderabad)లో రియల్ ఎస్టేట్ (Real Estate)ను పూర్తిగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
సబర్మతి నది (Sabarmati River) ప్రక్షాళణ సమయంలో గుజరాత్ ప్రభుత్వం (Gujarat Government) నిరుపేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లను నిర్మించి వారిని అక్కడికి తరలించాకే నది ప్రక్షాళన మొదలు పెట్టారని గుర్తు చేశారు. కేటీఆర్ (KTR)పై విచారణకు ప్రభుత్వం గవర్నర్ (Governor) అనుమతి కోరడం హస్యాస్పదంగా ఉందన్నారు. కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి, మంత్రి కాదని.. ఓ సాధారణ ఎమ్మెల్యే అని అందుకు గవర్నర్ (Governor) అనుమతి అక్కర్లేదని కామెంట్ చేశారు. లగచర్ల (Lagacharla)లో కలెక్టర్‌పై దాడి కల్వకుంట్ల కుటుంబం చేయించిన పనేనని అన్నారు. కేటీఆర్ (KTR)ది మేకపోతు గాంభీర్యమని.. అరెస్ట్ చేసి జైల్లో పడేయాలన్నారు. టీబీజేపీ (TBJP) అధ్యక్ష రేసులో తాను కూడా ఉన్నానని ధర్మపురి అర్వింద్ అన్నారు.