‘కరోనా’ నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు..?

by Shyam |
High court
X

దిశ, హైదరాబాద్
కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురువారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపంలో హైకోర్టుకు సమర్పించింది. వరంగల్, ఎంజీఎం, హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఏజీ హైకోర్టుకు తెలిపారు. రేపటి నుంచి ఉస్మానియా ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. అధిక ధరలకు మాస్క్ లు, శానిటైజర్లు విక్రయిస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 23 లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

TAgs: corona virus, high court enquiry,Report submitted AG,What are the actions of those who are selling at high prices?

Advertisement

Next Story

Most Viewed