ఉతికి ‘ఆరే’సిన పొలార్డ్.. యువరాజ్ తర్వాత అతడే..

by Anukaran |
Kieron Pollard slams 6 sixes in a over
X

దిశ, వెబ్ డెస్క్ : వెస్టీండీస్ విధ్వంసకర ఆటగాడు కీరన్ పొలార్డ్ మరోసారి అదరగొట్టాడు. టీ20లు అంటేనే పూనకం వచ్చినట్టు ఆడే విండీస్ టీ20 కెప్టెన్.. తాజాగా మరో రేర్ ఫీట్ సాధించాడు. ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో భాగంగా పొలార్డ్ ఈ ఘనత సాధించాడు. శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ పొలార్డ్ బ్యాటింగ్ ధాటికి బలయ్యాడు. తాజా రికార్డుతో పొలార్డ్ భారత్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సరసన చేరాడు. టీ20లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా యువరాజ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

బుధవారం శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 131 పరుగులు చేశారు. పత్తుమ్ నిస్సంక 39 రన్స్‌తో టాప్ స్కోరర్. 132 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆదిలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో ఓవర్లోపే ఆ జట్టు నాలుగు వికెట్లను కోల్పోయింది. దనంజయ్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా లూయిస్, గేల్, పూరన్‌లను పెవిలియన్‌కు పంపి హ్యాట్రిక్ సాధించాడు. ఈ సమయంలో పొలార్డ్ బ్యాటింగ్‌కు దిగాడు.

https://twitter.com/ICC/status/1367282438905364483?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1367282438905364483|twgr^|twcon^s1_&ref_url=https://www.india.com/sports/kieron-pollard-slams-6-sixes-in-an-over-becomes-second-player-after-yuvraj-singh-to-achieve-feat-in-t20is-watch-video-4466121/

ఆరో ఓవర్లో ధనంజయ్ మొదటి బంతిని ఎదుర్కొన్న పొలార్డ్ దానిని సిక్సర్‌గా మలిచాడు. ఇక నుంచి తర్వాతి ఐదు బంతులు కూడా స్టాండ్స్‌కే క్యూ కట్టాయి. దీంతో ఛేదించాల్సిన లక్ష్యం మరీ చిన్నదైపోయింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టడంతో పాటు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసిన పొలార్డ్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వరించింది.

కాగా.. 2007లో టీ20 తొలి ప్రపంచకప్ సందర్భంగా యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. అప్పుడు బలైన బౌలర్ స్టువర్ట్ బ్రాడ్. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ గిబ్స్ పేరు మీద ఉండేది. అయితే ఆయన వన్డేలలో ఈ ఫీట్ సాధించాడు. టీ20లో ఈ రికార్డు ఇప్పటిదాకా యువరాజ్ పేరు మీదే ఉండగా.. తాజాగా పొలార్డ్ అతడి సరసన చేరాడు.

Advertisement

Next Story

Most Viewed