- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ ఫైర్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం పిలువడంపై సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. దొడ్డిదారిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలనుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభిర్ణించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు సమాఖ్య వ్యవస్థ మౌలిక సూత్రాలకు పూర్తి విరుద్ధమని ఆక్షేపించారు. గత వారం పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటన తర్వాతి రోజు ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్‌పై రావాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. వారిని పంపించడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం అంగీకరించలేదు. మరోసాకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేస్తూ వీలైనంత తర్వగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేయాలని కోరింది.