- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్, బిడెన్ పాటకు నెటిజన్లు ఫిదా!
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో నవంబర్ 2న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అక్కడ వాడి వేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ట్రంప్, మరో వైపు బిడెన్‌లు పోటాపోటీగా ఎన్నికల క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ట్రంప్, బిడెన్ మధ్య జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌కు ఓ యూట్యూబర్ తనదైన శైలిలో కామెడీ జోడించాడు. దీంతో సీరియస్ డిబేట్ కాస్తా నవ్వులపాలైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అంశం ఏదైనా సరే.. మీమ్స్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ రెడీగా ఉంటారు. తాజా తాజా అంశాలపై ఆన్ ది స్పాట్ మీమ్స్, వీడియోలు, పాటలు క్రియేట్ చేస్తారు. అందులోనూ ఎన్నికలంటే.. ఇక వీరికి పండగే అని చెప్పాలి. ఇండియాలోనూ ఎన్నికల టైమ్‌లో లీడర్లు సభలో మాట్లాడే పంచ్‌లు, సందేశాలు బోలెడన్ని పాటల రూపంలో వచ్చి వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అగ్రరాజ్యంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అమెరికన్ మ్యూజీషియన్, లిరిక్ రైటర్ వియర్డ్ అల్ యంకోవిక్.. ట్రంప్, బిడెన్ డిబేట్‌ను ఓ ఫన్నీ వీడియోగా క్రియేట్ చేశాడు. వాళ్లు మాట్లాడిన కొన్ని పదాలను తీసుకుని.. వాటితో ఓ ట్యూన్ కట్టేశాడు. మధ్య మధ్యలో మాట్లాడుతూ.. పాట పాడుతూ.. సీరియస్ డిబేట్‌ను కాస్త సిల్లీ డిబేట్‌గా మార్చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘వుయ్ ఆల్ ఆర్ డూమ్డ్ ట్రంప్ వర్సెస్ బిడెన్’ అనే పేరుతో ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇప్పటికే ఈ వీడియోకు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.